Friday, October 2, 2026
Google search engine
Homeతెలంగాణహలో జర్నలిస్ట్ చలో చందానగర్.

హలో జర్నలిస్ట్ చలో చందానగర్.

డిమాండ్స్ డే సందర్బంగా శేరిలింగంపల్లి లో పిజేఆర్ స్టేడియం వద్ద నిరసన కార్యక్రమం.

భారత శక్తి :
జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ నిరంతర పోరాటం చేస్తుందని రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎండీ సలీమ్ పాషా, కార్యదర్శి మేకల సత్యనారాయణ ఆన్నారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ పిలుపు మేరకు అక్టోబర్ 2 డిమాండ్స్ డే సందర్బంగా రంగారెడ్డి జిల్లా యూనియన్ అధ్వర్యం లో శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్ పిజేఆర్ స్టేడియం లో గల మహాత్మ గాంధీ విగ్రహం వద్ద జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయలని వారు కోరారు. ఈ కార్యక్రమం లో జిల్లా లోని అన్ని నియోజకవర్గాల,మండలాల పాత్రికేయులు పెద్ద సంఖ్య లో పాల్గోని విజయవంతం చేయాలనీ వారు కోరారు. రిపోర్టర్ సభ్యులు అందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు.దేశంలో జర్నలిస్ట్ లపై జరుగుతున్న దాడులు,వేధింపులు,హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు, తదితర సమస్యల పరిష్కారం కోరుతూ జాతి పిత మహాత్మ గాంధీ గారికి వినతిపత్రం ఇవ్వనున్నట్లు వారు తెలిపారు. అదేవిదంగా దశల వారిగా మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీ, అధికారులకు వినతి పత్రాలు అందించనున్నట్లు తెలిపారు.శుక్రవారం ఉదయం 10:30 గంటలకు జరిగే కార్యక్రమం లో జిల్లాలోని జర్నలిస్టులు హాజరు కావాలని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments