- ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్యపై వేటు..
- అవినీతి, అక్రమ ఆరోపణల నేపథ్యంలో శాఖాపరమైన చర్యలు
ఎల్బీనగర్:
ఎల్బీనగర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కృష్ణయ్యపై సస్పెన్షన్ వేటు పడింది. పలు అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఉన్నతాధికారులు ఆయనపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
కొన్ని రోజుల క్రితమే కృష్ణయ్యను సస్పెండ్ చేసేందుకు రంగం సిద్ధమైన సమయంలో అనారోగ్య కారణాలు చూపుతూ ఆయన ఆసుపత్రిలో చేరినట్లు తెలిసింది. దీంతో అప్పట్లో సస్పెన్షన్ వ్యవహారం వాయిదా పడింది.ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి తిరిగి విధుల్లో చేరిన కృష్ణయ్యకు వెంటనే షాక్ తగిలింది. డ్యూటీలో చేరిన వెంటనే సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ కావడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయనపై వచ్చిన అవినీతి, అక్రమ ఆరోపణలపై శాఖాపరమైన విచారణకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.డ్యూటీలో అడుగుపెట్టగానే సస్పెన్షన్ ఉత్తర్వులు రావడంతో ఎల్బీనగర్ పోలీస్ వర్గాల్లో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.


