ఎల్బీనగర్:
మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ లో గల ఎన్టీఆర్ నగర్ బంజారా బస్తీలో పారిశుధ్య సమస్య తీవ్రంగా ఉండటంతో మహేశ్వరం శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి బంజారా బస్తీలో పర్యటించి అధికారులకు పలు సూచనలు చేసారు.గతంలో పెట్టిన 60 లక్షల ప్రతిపాదన పనులు మరియు 20 లక్షల కొత్త ప్రతిపాదనతో బంజారా బస్తీనీ కలిపే డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరించాలని అధికారులకు సూచించారు. ఈ పనులతో సిరినగర్, వాస్తుకాలనీ, చిత్ర లేఔట్, ఎన్టీఆర్ నగర్ వాసుల డ్రైనేజీ సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు జల మండలి డీజీఎం చంద్రు నాయక్, ఎంఎంసీ ఈఈ కార్తీక్, డిఈ విజయ్, శానిటేషన్ డిఈ చందన డివిజన్ అధ్యక్షులు పెండ్యాల నగేష్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ, సాజీద్, గొడుగు శ్రీనివాస్, సిద్దగోని వెంకటేష్ గౌడ్, శంకర్ నాయక్, బాలు నాయక్, కృష్ణా నాయక్, లాల్ మహమ్మద్, నర్సింహా నాయక్, శివ నాయక్, నవీన్ నాయక్, సంతోష్, వాజీద్, పాల్గొన్నారు


