Friday, October 9, 2026
Google search engine
Homeఇంటర్నేషనల్“గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు ను నమోదు చేసుకోగలరు అని మనవి.

“గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు ను నమోదు చేసుకోగలరు అని మనవి.

అర్హత కలిగిన ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ 06-11-2026లోపు తప్పనిసరిగా ఫారం -18 ద్వారా తమ పేరును నమోదు చేసుకోవాలని తెలియచేసిన గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరేకపూడి గాంధీ గారు

శేరిలింగంపల్లి : రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హత కలిగిన గ్రాడ్యుయేట్లు తప్పనిసరిగా తమ ఓటును నమోదు చేసుకోవాలని PAC చైర్మన్ గాంధీ పిలుపునిచ్చారు.

ఎన్‌రోల్‌మెంట్ ఫారం–18ను స్వయంగా నింపి గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకున్నారు.

ఈ సందర్భంగా పి ఏ సి చైర్మన్ ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ, హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి సంబంధించిన రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలనుకునే అర్హత కలిగిన ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ 06-11-2026లోపు తప్పనిసరిగా Form-18 ద్వారా తమ పేరును నమోదు చేసుకోవాలని పి ఏ సి చైర్మన్ గాంధీ సూచించారు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితా ప్రతి ఎన్నికకు ముందు కొత్తగా (De-novo) రూపొందించబడుతుందని, గతంలో గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదై ఉన్నవారు సైతం ప్రస్తుత ఎన్నిక కోసం తాజాగా ఫారం -18 సమర్పించాల్సి ఉంటుందని పి ఏ సి చైర్మన్ గాంధీ తెలిపారు.

అలాగే, సాధారణ అసెంబ్లీ ఓటరు జాబితాలో పేరు ఉండటం మాత్రమే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కుకు సరిపోదని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు కోసం ప్రత్యేకంగా ఫారం -18 ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉంటుందని పి ఏ సి చైర్మన్ గాంధీ స్పష్టం చేశారు.

అర్హత కలిగిన గ్రాడ్యుయేట్లు తమ అసెంబ్లీ EPIC/ఓటరు వివరాలను ఫారం -18లో నమోదు చేసుకోవచ్చని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు కోసం ప్రత్యేకంగా మరో EPIC నంబర్ అవసరం లేదని PAC చైర్మన్ గాంధీ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments