Wednesday, October 14, 2026
Google search engine
Homeతెలంగాణరంగారెడ్డి జిల్లాలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులు ముందుకు సాగాలి: సీ.ఎం రేవంత్ రెడ్డి

రంగారెడ్డి జిల్లాలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులు ముందుకు సాగాలి: సీ.ఎం రేవంత్ రెడ్డి

ఢిల్లీలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన రంగారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షురాలు చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి

ఢిల్లీ

ఢిల్లీలోని ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో రంగారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షురాలు చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి పాల్గొన్నారు. ఇటీవల అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు చేపట్టిన నిరసన మార్చ్ అత్యంత విజయవంతం కావడంతో, ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
రాష్ట్రంలో పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై పోరాటాలు మరియు భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో కూలంకషంగా చర్చించారు. గౌరవ మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ మరియు సహకార కేంద్ర బ్యాంకుల అధ్యక్షులతో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించి పలు కీలక సూచనలు, మార్గదర్శకాలు చేశారు.

ఈ సందర్భంగా ఢిల్లీలో ముఖ్యమంత్రిని రంగారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షురాలు చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో పార్టీ పటిష్టతకు చేపడుతున్న కార్యక్రమాలను ఈ సందర్భంగా ఆమె ముఖ్యమంత్రికి వివరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments