శేరిలింగంపల్లి
వ్యాపార,వాణిజ్య ,పారిశ్రామిక రంగంలో యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్ ఉద్దేశమని సమాఖ్య స్పాన్సర్ షిప్ ,శ్రీ ఇన్ప్రా ఎండీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం మాదాపూర్ హైటెక్స్ లో నిర్వహించిన సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్ లో ఏర్పాటు చేసిన శ్రీ ఇన్ప్రా , సన్ స్కోప్ గ్రూప్ స్టాల్ ఆకర్షిస్తోంది. వర్టికల్ గ్లాస్ బిల్డింగ్ లో సోలార్ ప్యానల్స్ అమర్చడం , ఇంటింటికి సోలార్ ఫ్లాంట్ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా సన్ స్కోప్ గ్రూప్ తో భాగస్వామ్యం ఒప్పందం కుదుర్చుకున్నట్లు శ్రీ ఇన్ప్రా ఎండీ శ్రీనివాస రావు తెలిపారు . ఇళ్లకు సంబంధించిన సివిల్ కన్స్ట్రక్షన్, ఇంటీరియర్ డిజైన్స్, పాత ఇళ్ల రినోవేషన్స్, వాటర్ప్రూఫింగ్ సేవలు అందిస్తున్న శ్రీ ఇన్ప్రా సమాఖ్య గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ లో సన్ స్కోప్ గ్రూప్ భాగస్వామ్యంతో సోలార్ పవర్ రంగంలోకి అడుగుపెట్టినట్లు తెలిపారు . దేశం వేగంగా అభివృద్ది చెందుతున్న తరుణంలో విద్యుత్ కు డిమాండ్ ఉందని…. దీనికి ఎల్ నినో ప్రభావంతో విద్యుత్ కొరత ఏర్పడే అవకాశం ఉందని సన్ స్కోప్ గ్రూప్ సంస్థ సీఈఓ సంజీవ్ కుమార్ తెలిపారు . ప్రకృతి నుండి లభించే వనరులతో సోలార్ విద్యుత్ ను ఉత్పత్తిని ప్రొత్సహించాల్సిన అవసరం ఉందన్నారు . సామాన్య మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరల్లోనే సోలార్ ప్యానెల్స్ ఇన్ స్టాల్ చేస్తున్నామని వెల్లడించారు . శ్రీ ఇన్ప్రా భాగస్వామ్యంతో దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సంజీవ్ కుమార్ తెలిపారు .ఈ కార్యక్రమంలో శ్రీ ఇన్ఫ్రా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


