శేరిలింగంపల్లి
పండుగ సాయన్న ముదిరాజ్ జయంతిని పురస్కరించుకొని కొండాపూర్లోని 8వ బెటాలియను లో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బెటాలియన్ కమాండెంట్ డి.శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పండుగ సాయన్న ముదిరాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కామాండెంట్ శివ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పండగ సాయన్న ధైర్యసాహసాలను, పోరాట స్ఫూర్తిని, ప్రజల కోసం చేసిన సేవలను స్మరించుకున్నారు. సమాజంలో ధైర్యం, ఆత్మగౌరవం, ప్రజాసేవ వంటి విలువలను పెంపొందించడంలో పండుగ సాయన్న జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ప్రజల కోసం పోరాడిన మహనీయుల జీవిత చరిత్రలను తెలుసుకోవడం ద్వారా యువతలో సామాజిక స్పృహ, సేవాభావం, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కమాండెంట్ యం. జయరాజ్ , అసిస్టెంట్ కమాండెంట్లు .డి. సత్యనారాయణ, డి.నరేందర్ రెడ్డి ఆర్ ఐ లు, ఆర్ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.


