Home సినిమా ‘SSMB 29’ ప్రాజెక్టు వేట షురూ…

‘SSMB 29’ ప్రాజెక్టు వేట షురూ…

0
69
'SSMB 29' project in SS Rajamouli and Mahesh Babu combo An official update which has not been released till now Zakkanna recently shared an interesting photo on Instagram With that, 'SSMB 29' became trending all at once.
'SSMB 29' project in SS Rajamouli and Mahesh Babu combo An official update which has not been released till now Zakkanna recently shared an interesting photo on Instagram With that, 'SSMB 29' became trending all at once.

ఎస్ఎస్ రాజ‌మౌళి, మ‌హేశ్ బాబు కాంబోలో ‘SSMB 29’ ప్రాజెక్టు
ఇప్ప‌టివ‌ర‌కూ బ‌య‌ట‌కురాని అఫీషియల్ అప్డేట్
తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో ఒక ఆస‌క్తిక‌ర‌మైన‌ ఫొటోను షేర్ చేసిన జ‌క్క‌న్న‌
దాంతో ఒక్క‌సారిగా ట్రెండింగ్‌లోకి ‘SSMB 29’

ద‌ర్శ‌కధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి, సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు కాంబోలో ‘SSMB 29’ ప్రాజెక్టును ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ మూవీ కోసం అటు మహేశ్ అభిమానుల‌తో పాటు సినీ ప్రియులంద‌రూ ఎంతో ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు. కానీ, ఇప్ప‌టివ‌ర‌కూ ఈ మూవీకి సంబంధించిన ఒక్క అఫీషియల్ అప్డేట్ రాలేదు. దాంతో ఫ్యాన్స్‌ కూడా ఒకింత నిరాశ చెందుతున్నారు.

అయితే, తాజాగా ద‌ర్శ‌కుడు జ‌క్క‌న్న త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఆస‌క్తిక‌ర‌మైన‌ ఫొటోను షేర్ చేశారు. దాంతో మ‌రోసారి ఈ ప్రాజెక్టుపై చ‌ర్చ మొద‌లైంది. ఈ సినిమా షూటింగ్ కోసం కెన్యాలోని అంబోసెలీ నేష‌న‌ల్ పార్క్‌ను రాజమౌళి సంద‌ర్శించారు. ఈ మూవీ షూటింగ్‌కు ఆ లొకేషన్ స‌రిపోతుందా? లేదా? అనేది తెలియడానికి జ‌క్క‌న్న అంబోసెలీ నేష‌న‌ల్ పార్క్‌ కు వెళ్లిన‌ట్లు స‌మాచారం. దానికి ‘కనుగొనడం కోసం తిరుగుతున్నా’ అంటూ ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ పెట్టారు.

ఇక ఆ ఫొటో చూసిన అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. త్వరగా మూవీ తాలూకు అప్డేట్ ఇవ్వాల‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా కోరుతున్నారు. కాగా, ప్రస్తుతం మూవీ టీమ్ మొత్తం ‘SSMB29’కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

ఇక ఈ సినిమా యాక్ష‌న్ అడ్వెంచ‌ర్‌గా ఉంటుంద‌ని కథా ర‌చ‌యిత విజయేంద్ర‌ప్ర‌సాద్ ఇప్ప‌టికే వెల్ల‌డించారు. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో హాలీవుడ్ టెక్నీషియ‌న్స్ కూడా భాగం కానున్నారు. ఈ మూవీ కోసం ఇప్ప‌టికే మ‌హేశ్ పూర్తిగా మేకోవ‌ర్ అయ్యారు. పొడ‌వాటి జుట్టు, గ‌డ్డంతో ఉన్న సూప‌ర్‌స్టార్‌ ర‌గ్ డ్ లుక్ ఫ్యాన్స్‌ను అమితంగా ఆక‌ట్టుకుంటోంది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here