ఎల్బీనగర్:
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మార్గదర్శకత్వంలో, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలతో రంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కొత్తపేటలో ఉన్న విక్టోరియా మెమోరియల్ స్కూల్‌లో ‘సురక్షిత్ బచ్పన్ అభియాన్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పోక్సో కోర్టు న్యాయమూర్తి జి. శ్రీనివాస్ పాల్గొని, విద్యార్థులకు బాలల రక్షణ, బాలలపై లైంగిక నేరాల నుంచి రక్షణ చట్టం ( పోక్సో చట్టం, 2012), బాలల హక్కులు మరియు లైంగిక వేధింపుల నుంచి రక్షణపై అవగాహన కల్పించారు.బాలల భద్రత కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని నిర్వాహకులు తెలిపారు.
అదేవిధంగా, డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రవి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, విద్యార్థులకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్ గురించి వివరించారు. బాలలపై జరిగే లైంగిక వేధింపులను ఎలా గుర్తించాలి, అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఎవరికి తెలియజేయాలి, తమను తాము ఎలా రక్షించుకోవాలనే అంశాలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా, సైకియాట్రిస్ట్ అనిత పాల్గొని, విద్యార్థులకు మానసిక ఆరోగ్యం, భావోద్వేగ నియంత్రణ, ఒత్తిడిని అధిగమించడం మరియు సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ ఎస్కే పాషా వైస్ ప్రిన్సిపాల్ శివ ప్రసాద్ పారా లీగల్ వాలంటీర్స్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


