Saturday, October 31, 2026
Google search engine
Homeతెలంగాణదేశం క‌ష్టాల్లో ఉంటే విప‌క్షాల‌కు సంతోషం..ప్ర‌ధాని మోదీ తీవ్ర ఆరోప‌ణ‌లు.!

దేశం క‌ష్టాల్లో ఉంటే విప‌క్షాల‌కు సంతోషం..ప్ర‌ధాని మోదీ తీవ్ర ఆరోప‌ణ‌లు.!

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం పడకుండా చర్యలు | పీఎం కిసాన్ నిధుల విడుదల వేదికగా ప్రతిపక్షాల వైఖరిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన మోడీ.

హైదరాబాద్:

అంతర్జాతీయ వ్యాపార మార్గాలు, గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థలు దెబ్బతింటున్న తరుణంలో, దేశంలో వదంతులు వ్యాప్తి చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేసేందుకు కొన్ని రాజకీయ శక్తులు యత్నిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు చేశారు. గుజరాత్‌లోని బనస్కాంతలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద లబ్ధిదారులకు నిధులను పంపిణీ చేసిన అనంతరం ప్రతిపక్షాల తీరుపై ధ్వజమెత్తారు.

అనుమానాలు, వదంతులపై స్పష్టత
పశ్చిమాసియా పరిణామాల వల్ల అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ, ఎరువులు, గ్యాస్ కొరత ఏర్పడుతుందంటూ అసత్య ప్రచారాలు సాగిస్తున్నారని ప్రధాని తెలిపారు. సమాజంలో గందరగోళం సృష్టించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. దేశం సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో మద్దతుగా నిలవాల్సింది పోయి, ఇబ్బందులు ఎదురైతే సంతోషించే ధోరణి ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎరువుల భారం రైతులపై పడనివ్వం
ప్రపంచ మార్కెట్‌లో ఎరువులు, ఇంధన ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ, ఆ అదనపు భారాన్ని దేశీయ రైతాంగంపై మోపకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగానికి అవసరమైన ఎరువుల సరఫరా సజావుగా సాగేలా అంతర్జాతీయంగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు పేర్కొన్నారు.

కర్షక సంక్షేమానికి ప్రాధాన్యం:
రైతాంగానికి ఆర్థిక ఊసటనిచ్చే క్రమంలో పీఎం కిసాన్ పథకంలో భాగంగా 24వ విడత నిధులను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేసినట్లు వెల్లడించారు. సుమారు రూ. 19,000 కోట్ల మొత్తాన్ని దేశవ్యాప్తంగా ఉన్న 9.34 కోట్ల మంది రైతు కుటుంబాలకు అందించినట్లు తెలిపారు. క్లిష్ట సమయాల్లోనూ సంక్షేమ పథకాలను అప్రతిహతంగా కొనసాగిస్తూ, వ్యవసాయ రంగాన్ని బలపరిచేందుకే ప్రాధాన్యం ఇస్తున్నామని పునరుద్ఘాటించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments