Tuesday, November 3, 2026
Google search engine
Homeఇంటర్నేషనల్పోలీసు సిబ్బందికి పదోన్నతి శిక్షణ షురూ

పోలీసు సిబ్బందికి పదోన్నతి శిక్షణ షురూ

  • 1,435 మంది పోలీసులకు పదోన్నతి శిక్షణ ప్రారంభం
  • మూడు శిక్షణ కళాశాలల్లో తరగతులు ప్రారంభం

హైదరాబాద్‌

రాష్ట్ర పోలీసు శాఖలో 1,435 మంది సిబ్బందికి పదోన్నతికి ముందస్తు శిక్షణ సోమవారం ప్రారంభమైంది. రాష్ట్రంలోని మూడు పోలీసు శిక్షణ కళాశాలల్లో (పీటీసీ) సివిల్‌, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ విభాగాలకు చెందిన సిబ్బందికి ఈ శిక్షణ ఇస్తున్నారు. వీరిలో 899 మంది సివిల్‌ విభాగం, 536 మంది ఏఆర్‌ విభాగానికి చెందినవారు.

సివిల్‌ విభాగంలో.. మేడ్చల్ పీటీసీలో 586 మంది కానిస్టేబుళ్లకు హెడ్‌ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కోసం శిక్షణ ప్రారంభించారు. కరీంనగర్‌ పీటీసీలో 313 మంది హెడ్‌ కానిస్టేబుళ్లు, ఏఎస్సైలకు ఎస్సైలుగా పదోన్నతి శిక్షణ ఇస్తున్నారు.

ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌లో.. వరంగల్‌ పీటీసీలో 302 మంది కానిస్టేబుళ్లకు హెడ్‌ కానిస్టేబుళ్లుగా, 176 మంది హెడ్‌ కానిస్టేబుళ్లకు ఏఆర్‌ఎస్సైలుగా పదోన్నతి శిక్షణ ప్రారంభమైంది. కరీంనగర్‌ పీటీసీలో మరో 58 మంది ఏఆర్‌ఎస్సైలకు ఎస్సైలుగా పదోన్నతి శిక్షణ ఇస్తున్నారు.

మేడ్చల్ పీటీసీలో జరిగిన కార్యక్రమానికి సాంకేతిక సేవలు, శిక్షణ విభాగం అదనపు డిజిపి డాక్టర్‌ ఆకున్‌ సబర్వాల్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కరీంనగర్‌లో జరిగిన కార్యక్రమంలో పోలీసు కమిషనర్‌ గౌష్‌ ఆలం, వరంగల్‌లో జరిగిన కార్యక్రమంలో పోలీసు కమిషనర్‌ ఎన్‌.శ్వేత పాల్గొన్నారు.

ఉన్నత హోదాల్లో బాధ్యతలు చేపట్టనున్న సిబ్బందికి వృత్తిపరమైన పరిజ్ఞానం, విధి నిర్వహణ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలను పెంపొందించడమే ఈ శిక్షణ లక్ష్యమని అధికారులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments