Monday, November 2, 2026
Google search engine
Homeఇంటర్నేషనల్వైద్యం కరువాయే..!

వైద్యం కరువాయే..!

  • ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ లేకుండానే 4 నెలలుగా వైద్యం
  • అందుబాటులోలేని నర్సులు
  • పట్టించుకోని డిఎంఓ
  • పేద ప్రజల ప్రాణాలంటే మీకు లెక్కలేద..?
  • ఆసుపత్రి బాగోతాన్ని బయటపెట్టిన కొల్లా శంకర్

కూకట్పల్లి

కేపిహెచ్‌బి 4వ ఫేజ్ బస్తీ దవాఖానలో ప్రజలకు వైద్య సేవలు నిర్వహించడంలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానిక ప్రజలు కూకట్‌పల్లి జనసేన పార్టీ కోఆర్డినేటర్ కొల్లా శంకర్ ఫిర్యాదు ఇవ్వడంతో.. వెంటనే ఆదివారం జనసైనికులతో కలిసి బస్తీ దవాఖానను సందర్శించి దవాఖానలోని సిబ్బందితో మాట్లాడి అక్కడ ఉన్న పరిస్థితులను ఆరా తీశారు. గత 4 నెలలుగా దవాఖానలో డాక్టర్ లేకపోవడం, అలాగే సబ్-నర్స్ కూడా అందుబాటులో లేకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తించారు. ​ఈ సందర్భంగా కొల్లా శంకర్ మాట్లాడుతూ:
​”ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందించాల్సిన బస్తీ దవాఖానలో గత నాలుగు నెలలుగా వైద్యులు లేకపోవడం, అత్యవసర పరిస్థితిలో ప్రధమ చికిత్స చేసే స్థాయి సిబ్బంది కూడా లేకపోవడం విచారకరమని తెలియజేసారు. వైద్య వృత్తిపై అవగాహన లేని ఒక మహిళను దావఖానాలో సహాయ సిబ్బందిగా పెట్టుకోవడం బాధాకరమని తెలియజేసారు, పేద ప్రజల ఆరోగ్య విషయంలో అధికారులు చూపిస్తున్న నిర్లక్ష్యంపై ఆగ్రహిస్తూ అధికారులు తక్షణమే స్పందించి కెపిహెచ్‌బి 4వ ఫేజ్ బస్తీ దవాఖానకు పూర్తి స్థాయి డాక్టర్‌ను, సబ్-నర్స్‌ను నియమించి, వెంటనే ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తేకపోతే జనసేన పార్టీ తరఫున పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. ​ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీనివాస్ గోవింద, పాదం సూర్య, నీరజ్ కుమార్, గోపికృష్ణ జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments