Monday, November 2, 2026
Google search engine
Homeతెలంగాణనోటీసులు బూటకం.. కూల్చివేతలు నాటకం!

నోటీసులు బూటకం.. కూల్చివేతలు నాటకం!

  • అధికారులు, అక్రమార్కుల జుగల్బందీ.. బల్దియా సొమ్ము సొంత జేబుల్లోకి!
  • ఎం.ఎం.సి, ఎల్బీనగర్ జోన్ లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు..
  • హయత్ నగర్ సర్కిల్ 14 డిప్యూటీ కమిషనర్ అజ్మీరా స్వామి అవినీతి లీలలు..
  • ఉన్నతాధికారులు, న్యాయస్థానాల కళ్లల్లో కాటుక.. విజిలెన్స్ విచారణకు ప్రజల డిమాండ్..
  • మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి,ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహతో దృష్టి సారించకపోతే అబాసుపాలు కాక తప్పదు..

హైదరాబాద్

గృహ నివాసాల పేరిట అనుమతులు పొందడం.. ప్రధాన రహదారులు, జాతీయ రహదారులను ఆనుకుని భారీ అక్రమ కమర్షియల్ భవనాలు నిర్మించడం.. దర్జాగా సెల్లార్లు త్రవ్వేసి నిబంధనలను తొక్కేయడం.. ఇదీ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎం.ఎం.సి), ఎల్బీనగర్ జోన్ పరిధిలోని టౌన్ ప్లానింగ్ అధికారుల చేతివాటం! అక్రమ నిర్మాణాల వల్ల భవిష్యత్తులో తీవ్రమైన రద్దీ సమస్యలు, అగ్నిప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందంటూ స్థానిక ప్రజలు రాతపూర్వకంగా ఫిర్యాదులు చేసినా, వార్తా కథనాలు వెలువడినా అధికారుల తీరు మారడం లేదు.

ఉన్నతాధికారులకు తప్పుడు నివేదికలు:
స్థానిక ప్రజల ఫిర్యాదులపై జోనల్ స్థాయి, కార్పొరేషన్ కమిషనర్ స్థాయి ఉన్నతాధికారులు వివరణ కోరినప్పుడు క్రింది స్థాయి అధికారులు కొత్త నాటకానికి తెరదీస్తున్నారు. “నోటీసులు జారీ చేశాం.. కూల్చివేతలు జరిపాం” అంటూ అరకొర కూల్చివేతల తప్పుడు ఛాయాచిత్రాలను పంపి ఉన్నతాధికారులను, న్యాయస్థానాలను పూర్తిగా మభ్యపెడుతున్నారు. వెనుక మాత్రం అక్రమ నిర్మాణదారులతో లక్షల రూపాయల చరమాంకాలు కుదుర్చుకుని, ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన పన్నుల ఆదాయానికి గండి కొడుతూ సొంత జేబులు నింపుకుంటున్నారు.

హయత్ నగర్ సర్కిల్ 14 పరిధిలో అక్రమాల తీరు:
హయత్ నగర్ సర్కిల్ 14 పరిధిలో పదుల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. అధికారుల బూటకపు చర్యలకు ఇవే నిదర్శనాలు:

  • విజయవాడ రహదారి ఆనుకుని: హయత్ నగర్ విభాగం పరిధిలోని విజయవాడ జాతీయ రహదారిని ఆనుకుని, కెప్టెన్ కుక్ పక్కన భారీ అక్రమ నిర్మాణం జరిపారు. నోటీసులు ఇచ్చామని, కూల్చివేతలు పూర్తి చేశామని ఉన్నతాధికారులను అధికారులు బురిడీ కొట్టిస్తున్నారు.
  • వనస్థలిపురం రక్షక భట నిలయం ఎదురుగా: ఇక్కడ రెండు భారీ అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. వీటిపై కూడా కాగితాలపై నోటీసులు ఇచ్చినట్లు చూపుతూ ఉన్నతాధికారులను మోసం చేస్తున్నారు.

విజిలెన్స్ విచారణకు డిమాండ్:
ఇలా పదుల సంఖ్యలో అక్రమ నిర్మాణాలను తప్పుడు మార్గాల్లో క్రమబద్ధీకరిస్తూ, చట్టాలను ఉల్లంఘిస్తూ, వ్యవస్థను మోసం చేస్తున్న అవినీతి అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు, స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఉన్నతస్థాయి విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగి లోతైన పరిశోధన జరిపి, ఈ అక్రమాలను, అవినీతి తిమింగలాలను వెలికితీసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments