Monday, November 2, 2026
Google search engine
Homeతెలంగాణమేడ్చల్‌లో కేటీఆర్‌కు ఘన స్వాగతం

మేడ్చల్‌లో కేటీఆర్‌కు ఘన స్వాగతం

  • పార్టీ జెండా ఆవిష్కరణ…
  • కేటీఆర్ రాకతో మేడ్చల్‌లో గులాబీ పండుగ….

​మేడ్చల్

​అదిలాబాద్ ‘రైతు గర్జన’ పర్యటనకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు మేడ్చల్‌ పట్టణంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్ కేటీఆర్ కు గుమ్మడికాయతో దిష్టి తీశారు. మహిళలు హారతులు పట్టారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆయన రాకతో మేడ్చల్‌లో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం, సందడి నెలకొంది.
​ఈ కార్యక్రమంలో మాజీమంత్రి, స్థానిక శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి చామకూర మహేందర్ రెడ్డి, ఎల్లంపేట మున్సిపల్ చైర్ పర్సన్ లావుడియా శ్రీదేవి రమేష్ నాయక్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మద్దుల శ్రీనివాస్ రెడ్డి, ఎల్లంపేట మున్సిపల్ బిఆర్ఎస్ కౌన్సిలర్ సద్ది నిషిత రెడ్డి, గుండ్ల పోచంపల్లి మున్సిపల్ మాజీ కౌన్సిలరులు అమరం జైపాల్ రెడ్డి, అమరం హేమంత్ రెడ్డి, బేరి బాలరాజు, పెంటయ్య జవహర్ నగర్ కార్పొరేషన్ మాజీ మేయర్ మేకల కావ్య , ధమ్మాయిగూడ మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్, ఆకిటి నవీన్ రెడ్డి, తో పాటు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments