శేరిలింగంపల్లి :
కొండాపూర్ 8వ బెటాలియన్లో కమాండెంట్ డి. శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సైబరాబాద్ కమిషనరేట్ సైబర్ సెక్యూరిటీ వింగ్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ వాలంటీర్లు స్రవంతి, శ్రీకాంత్ బృందం హాజరై, బెటాలియన్ సిబ్బందికి సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ప్రస్తుతం రోజురోజుకీ సైబర్ నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, మన కుటుంబ సభ్యులను, ప్రజలను సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఎలా కాపాడుకోవాలో సవివరంగా వివరించారు. సైబర్ నేరాల వల్ల ఎంతో మంది ఆర్థికంగా నష్టపోతున్నారని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ ఎం. జయరాజు అసిస్టెంట్ కమాండెంట్లు డి. సత్యనారాయణ, వి. అనిల్ కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, సబ్-ఇన్స్పెక్టర్లు, సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.



