Friday, November 6, 2026
Google search engine
Homeతెలంగాణరేషన్ డీలర్లకు హుజూర్‌.. పేదల దరఖాస్తులపై నిర్లక్ష్యం!

రేషన్ డీలర్లకు హుజూర్‌.. పేదల దరఖాస్తులపై నిర్లక్ష్యం!

సరూర్‌నగర్ మండల్ సివిల్ సప్లై సీనియర్ అసిస్టెంట్ తీరుపై విమర్శలు

రేషన్ షాప్ డీలర్లు ఇచ్చిన రేషన్ కార్డు దరఖాస్తులకు వెంటనే ఆమోదం..

పేదల దరఖాస్తులు మాత్రం మూటకట్టి పక్కన పెడుతున్న వైనం..

ఎల్బీనగర్:

పేదలకు, మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాల్సిన పౌరసరఫరాల శాఖలోనే పేదల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సరూర్‌ నగర్ మండల కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సీనియర్ అసిస్టెంట్ తీరుపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.రేషన్ షాపు డీలర్లు సమర్పించే రేషన్ కార్డు దరఖాస్తులకు వెంటనే ఆమోదం తెలుపుతూ, పేద ప్రజలు, మధ్యతరగతి వారు నేరుగా మండల కార్యాలయానికి వచ్చి సమర్పించే రేషన్ కార్డు దరఖాస్తులను మాత్రం మూటకట్టి పక్కన పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో కొత్త రేషన్ కార్డులు, ఇతర పౌరసరఫరాల సేవల కోసం దరఖాస్తు చేసుకునే పేదలు, మధ్యతరగతి ప్రజలు నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అధికారులు, డీలర్లు రాగానే వారి వెంట వెళుతూ, దరఖాస్తుదారులు మొబైల్ ఫోన్ కు ఫోన్ చేస్తే సమాధానం ఇవ్వకుండా, దరఖాస్తుల పరిష్కారంలో వివక్ష చూపుతున్నారనే ఆరోపణలు రావడం ఆందోళన కలిగిస్తోంది. రేషన్ డీలర్లు ఇచ్చిన దరఖాస్తులకు ప్రాధాన్యత ఇచ్చి, పేదలు, మధ్యతరగతి ప్రజలు సమర్పించిన దరఖాస్తులను నిర్లక్ష్యం చేయడం వెనుక ఆంతర్యమేమిటని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు.పేదల దరఖాస్తులను ఎందుకు పక్కన పెడుతున్నారు? డీలర్ల ద్వారా వచ్చే దరఖాస్తులకే ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు..? అనే అంశాలపై ఉన్నతాధికారులయిన డిఎస్సీఓ వనజాత, ఏఎస్ఓ పుల్లయ్య తక్షణమే విచారణ జరిపి, స్థానిక ప్రజలు దరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డులను ఆమోదం తెలిపి, బాధిత పేదలకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments