Friday, November 6, 2026
Google search engine
Homeతెలంగాణప్రభాత్ నగర్ పార్కును కాపాడుకుందాం : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

ప్రభాత్ నగర్ పార్కును కాపాడుకుందాం : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

ఎల్బీనగర్

ఎల్బీనగర్ నియోజకవర్గ అభివృద్ధి,ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మార్నింగ్ వాక్ కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం 5:30 గంటలకు చైతన్యపురి డివిజన్ పరిధిలోని ప్రభాత్ నగర్ పార్కును ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా పార్కులో వాకింగ్ చేస్తున్న వాకర్లతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా వాకర్స్ మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా ప్రభాత్ నగర్ పార్కులో ప్రతిరోజూ వాకింగ్ చేస్తున్నామని, వందలాది మంది స్థానికులు ఈ పార్కుపైనే ఆధారపడి ఉన్నారని తెలిపారు. అయితే పక్కనే నిర్మాణంలో ఉన్న టీమ్స్ హాస్పిటల్ యాజమాన్యం పార్కు వద్ద గేటు ఏర్పాటు చేయనున్నట్లు తెలియడంతో ఆందోళన వ్యక్తం చేశారు.గేటు ఏర్పాటు చేస్తే పార్కులో వాకింగ్ చేయడానికి సరిపడా స్థలం లేకుండా పోతుందని,ఇప్పటికే వినియోగంలో ఉన్న పార్కును రెండు భాగాలుగా విభజించడం సమంజసం కాదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి స్పందిస్తూ గతంలో టీమ్స్ హాస్పిటల్ శంకుస్థాపన కార్యక్రమంలో అప్పటి సీఎం కేసిఆర్ ని కలిసి ఇటు టీమ్స్ హాస్పిటల్ నందు పోలీస్ స్టేషన్,చిల్డ్రన్స్ పార్క్, వాటర్ ట్యాంక్,సబ్ స్టేషన్, తదితర అవసరాల కోసం స్థలం కేటాయించాలని కోరగా వారు వెంటనే స్పందించి దానికి సంబంధించిన జీవో ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం మారిపోయాక సదరు జీఓను పక్కన పెట్టడం జరిగిందని అన్నారు.ఏది ఏమైనా ఈ పార్కు స్థలాన్ని వాకర్స్‌కు అందుబాటులో ఉంచేలా సంబంధిత అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి గేటు ఏర్పాటు చేయకుండా అవసరమైన చర్యలు తీసుకునేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే హామీపై వాకర్స్ హర్షం వ్యక్తం చేస్తూ సంతోషం తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి,తోట మహేష్ యాదవ్, చంద్రశేఖర్ రెడ్డి, త్రివేది, పవన్,జయశ్రీ, గట్టు శీను, రమణా రెడ్డి, కాలనీ అధ్యక్షులు బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments