తెలంగాణలో బ్యాటరీ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి – బూడిద నందారెడ్డి
ఎల్బీనగర్:
హైదరాబాద్ ఆటోనగర్‌లోని హైదరాబాద్ లారీ సప్లయర్స్ అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన “అమరాన్ ట్రక్ అండ్ ఫ్లీట్ ఓనర్స్ మీట్” కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ స్టేట్ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బూడిద నందారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా బూడిద నందారెడ్డి మాట్లాడుతూ, అమరాన్ బ్యాటరీ కంపెనీ వారు లారీ యజమానులు, రవాణా రంగ ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం పట్ల అసోసియేషన్ తరఫున హర్షం వ్యక్తం చేస్తూ వారిని స్వాగతిస్తున్నామని తెలిపారు.భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో బ్యాటరీల ఉత్పత్తి, సరఫరా, సర్వీసింగ్ వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.ఈ నేపథ్యంలో అమరాన్ కంపెనీ యాజమాన్యానికి ఆయన ఒక ముఖ్యమైన సూచన చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాల పరిసర ప్రాంతాల్లో ఉన్న పారిశ్రామిక పార్కుల్లో బ్యాటరీ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.దీని ద్వారా వినియోగదారులకు బ్యాటరీలు సులభంగా అందుబాటులోకి రావడమే కాకుండా, వారంటీ, మరమ్మతులు, సర్వీసింగ్ వంటి సమస్యలకు కూడా త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని తెలిపారు. లారీ యజమానులకు నాణ్యమైన ఉత్పత్తులతో పాటు మెరుగైన సేవలు అందించేలా సంస్థ ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆటోనగర్ ఇసుక లారీల యజమానుల సంఘం అధ్యక్షులు సుర్వి రాజు గౌడ్ హైదరాబాద్ లారీ సప్లయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాసరావు, లారీ అసోసియేషన్ నాయకులు అంజయ్య గౌడ్, కొండ శ్రీశైలం, ఆకుల శ్రీనివాస్, ఎంపల్ల జంగారెడ్డి, అంతటి నరేష్ గౌడ్, సుధాకర్ రెడ్డి, సుర్వి నరేష్ గౌడ్ తో పాటు పలువురు లారీ, ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ నాయకులు, లారీ యజమానులు పాల్గొన్నారు. అనంతరం లారీ యజమానుల ప్రతినిధులను అమరాన్ కంపెనీ వారు శాలువా కప్పి సన్మానం చేశారు.


