బడంగ్ పేట్
మహేశ్వరం నియోజకవర్గం జిహెచ్ఎంసి పరిధిలోని బడంగ్‌పేట్ సర్కిల్, జిల్లెలగూడ 59వ డివిజన్ గాయత్రి నగర్‌లో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.1.50 కోట్ల ప్రత్యేక నిధులతో నూతనంగా నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డితో కలిసి, మాజీ మంత్రివర్యులు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, గ్రంథాలయాలు విద్యార్థులకు, యువతకు విజ్ఞానాన్ని అందించడంతో పాటు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ గ్రంథాలయం స్థానిక ప్రజలకు, విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అర్కల భూపాల్ రెడ్డి, మాజీ మీర్‌పేట్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అర్కల కామేష్ రెడ్డి, దీప్లాల్ చౌహన్, సిద్దాల లావణ్య బీరప్ప, అనీల్ కుమార్ యాదవ్, లాడ్స్ స్కూల్ బీరప్ప, శ్రీను నాయక్, భూపేష్ గౌడ్, విజయ్, నర్సిరెడ్డి, అర్జున్, సహదేవ్, జంగయ్య, సుదర్శన్ రెడ్డి, యాదగిరి, శివ మూర్తి, సునీతా బాల్ రాజ్, మాదరి రమేష్, సిద్దాల అంజయ్య, స్నేహ లత, మాదేవి, సూరి లత, చారి,బాల్ రాజ్, కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్ర శేఖర్ రెడ్డి, ఓల్డ్ గాయత్రీ నగర్ అధ్యక్షుడు ఆంజనేయులు కాలనీవాసులు,మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


