ఎల్బీనగర్
ఎల్బీనగర్ పెరిక సంఘం, మహిళా సంఘం, యువసజన సంఘం ఆధ్వర్యంలో వనస్థలిపురం కర్నాటి గార్డెన్స్ నందు కార్తీక వన మాస సమారాధన సందర్భంగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, ఆధ్యాత్మిక విశిష్టతను చాటుతూ, ప్రజలందరూ ఐకమత్యంతో భక్తిశ్రద్ధలతో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనందకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బుర్రా వెంకటేశ్వర్లు అధ్యక్షులు, ముత్తినేని వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి,బాణి రజనీకాంత్ ఆర్థిక కార్యదర్శి,యర్రంశెట్టి రవీందర్ కార్యనిర్వాహక కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.


