Tuesday, November 17, 2026
Google search engine
Homeతెలంగాణదిల్‌సుఖ్‌నగర్‌లో మొబైల్ షాప్‌లో చోరీ

దిల్‌సుఖ్‌నగర్‌లో మొబైల్ షాప్‌లో చోరీ

గోడకు కన్నం వేసి లోపలికి ప్రవేశించిన దొంగ.. రూ.2 లక్షల సొత్తు అపహరణ

ఎల్బీనగర్

దిల్‌సుఖ్‌నగర్ ప్రధాన రహదారిపై ఉన్న ఓ మొబైల్ షాప్‌లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ సాయి అపర్ణ స్వప్న మొబైల్స్ షాప్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మొబైల్ షాప్ యజమాని చింతకాయల సాయికి చెందిన దుకాణం వెనుక గోడకు మనిషి పట్టేంత రంధ్రం చేసి లోపలికి ప్రవేశించిన దొంగలు, షాపులోని మొబైల్ ఫోన్లు, వివిధ రకాల యాక్సెసరీస్‌ను అపహరించారు. సుమారు రూ.2 లక్షల విలువైన సొత్తును ఎత్తుకెళ్లినట్లు యజమాని తెలిపారు. అంతే కాకుండా, చోరీ దృశ్యాలు రికార్డు కాకుండా సీసీ కెమెరాల వైర్లను కత్తిరించి, వాటి డీవీఆర్‌ను సైతం ఎత్తుకెళ్లారు.చోరీ విషయాన్ని గుర్తించిన షాప్ యజమాని చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దొంగల ఆచూకీ కోసం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments