Monday, November 16, 2026
Google search engine
Homeతెలంగాణజలమండలి నిర్లక్ష్యం... మంచినీళ్లు మళ్లీ రోడ్ల పాలు

జలమండలి నిర్లక్ష్యం… మంచినీళ్లు మళ్లీ రోడ్ల పాలు

  • మరమ్మతుల్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం..
  • క్వాలిటీ కంట్రోల్ బోర్డు అధికారులు చర్యలు తీసుకొని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని స్థానికుల డిమాండ్

ఎల్బీనగర్

జలమండలి అధికారుల పర్యవేక్షణలో అలసత్వం కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో, ఈ సమయంలో ప్రజలకు విలువైన తాగునీరు రోడ్లపాలవుతోంది. మన్సురాబాద్ డివిజన్ సహారా ఎస్టేట్ ప్రధాన రహదారిపై భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో నాలుగు రోజుల క్రితం రిపేర్ చేసినా కూడా మంచినీటి పైపులైన్ లీకేజీ సమస్య మళ్లీ తలెత్తింది. నాలుగు రోజుల క్రితమే ఇదే ప్రాంతంలో భారీగా తాగునీరు వృథాగా రోడ్లపై ప్రవహించడంతో స్పందించిన జలమండలి అధికారులు, కాంట్రాక్టరుకు ఆదేశాలు జారీ చేసి మరమ్మతులు చేయించారు. అయితే మరమ్మతులు నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా అజాగ్రత్తగా చేపట్టడంతో నాలుగు రోజులకే మళ్లీ అదే ప్రాంతంలో పైపులైన్ లీకై తాగునీరు వృథాగా ప్రవహిస్తోంది. ఒకసారి మరమ్మతులు చేసినా సమస్య పరిష్కారం కాకపోవడంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు పలు ప్రాంతాల్లో ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, మరోవైపు అందుబాటులో ఉన్న మంచినీరు ఇలా రోడ్లపాలవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ప్రజా ధనంతో చేపడుతున్న మరమ్మతు పనుల్లో కనీస నాణ్యత పాటించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జలమండలి ఉన్నతాధికారులు వెంటనే స్పందించి లీకేజీని శాశ్వతంగా అరికట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో చేపట్టిన మరమ్మతులపై సమగ్ర విచారణ జరిపి నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత అధికారులు, ఈ కాంట్రాక్టర్ మొన్న చేసిన లీకేజ్ పనులను, గతంలో నాణ్యత ప్రమాణాలు లేకుండా చేసిన జల మండలి పనులను క్వాలిటీ కంట్రోల్ బోర్డు వారు విజిలెన్స్ ఎంక్వైరీ చేయించాలని, ఈ కాంట్రాక్టర్ పై, నిర్లక్ష్యంగా వ్యవహరించిన జోన్ జలమండలి అధికారులపై చట్టపరమైన, తగిన చర్యలు తీసుకోవాలని, ఆ కాంట్రాక్టర్ ను ఇంకొక పని చేయకుండా బ్లాక్ లిస్టులో పెట్టాలని కోరుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజానీకం జలమండలి ఉన్నతాధికారులను కోరుతోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments