Wednesday, November 18, 2026
Google search engine
Homeతెలంగాణ3 కోట్ల రూపాయల వ్యయంతో సుందరమైన పార్కు నిర్మాణం

3 కోట్ల రూపాయల వ్యయంతో సుందరమైన పార్కు నిర్మాణం

సోమవారంనాడు ప్రారంభించిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

ఎల్బీనగర్:

ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని టీచర్స్ కాలనీ ఫేజ్‌-1, విశ్వేశ్వరయ్య కాలనీలకు సంయుక్తంగా దాదాపు రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించిన సుందరమైన పార్కును ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, సుమారు పది సంవత్సరాల క్రితమే ఈ పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పటికీ, కొందరు వ్యక్తులు ఈ స్థలంలో పార్కు నిర్మించకూడదంటూ కోర్టును ఆశ్రయించి కేసు వేయడంతో పనులు కొంతకాలం నిలిచిపోయాయని తెలిపారు.అయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా ఈ స్థలంలో పార్కును నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో ముందుకు సాగామని చెప్పారు. చివరకు అన్ని న్యాయపరమైన అడ్డంకులను అధిగమించి, స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేలా అత్యంత సుందరమైన పార్కును నిర్మించడం జరిగిందని పేర్కొన్నారు. అభివృద్ధి పనులను కొంతకాలం మాత్రమే అడ్డుకోగలరు.. కానీ చివరకు న్యాయమే గెలుస్తుందని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. ప్రజల అవసరాలే లక్ష్యంగా ఎలాంటి అడ్డంకులు ఎదురైనా అభివృద్ధి పనులను నిరంతరం కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో హస్తినాపురం మాజీ కార్పొరేటర్ పద్మ శ్రీనివాస్ నాయక్, డివిజన్ అధ్యక్షులు సత్యం చారి, నాగిరెడ్డి కాలనీవాసులు భూపాల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, యాదగిరి, కరుణాకర్, ప్రతాప్, ప్రసాద్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, అమర్ యాదవ్ తదితరు కాలనీ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments