Thursday, February 12, 2026
Google search engine
Homeస్పోర్ట్స్క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ వృద్ధిమాన్ సాహా

క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ వృద్ధిమాన్ సాహా

టీమిండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ వృద్ధిమాన్ సాహా అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ సీజ‌న్ త‌ర్వాత త‌ను క్రికెట్ నుంచి వైదొల‌గ‌నున్న‌ట్లు సాహా సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించాడు. ప్రస్తుతం సహా వయస్సు 40 ఏళ్ళు సాహా వయసు రీత్యా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

అయితే ఈ బెంగాల్ స్టార్ ప్లేయ‌ర్ గ‌త మూడు సంవత్సరాలుగా జాతీయ జ‌ట్టుకు దూరంగా వున్నాడు.కానీ ఐపీఎల్‌, ఫ‌స్ట్‌క్లాస్ క్రికెట్‌లో మాత్రం ఆడుతూ వ‌స్తున్నాడు. ఐపీఎల్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌కు వృద్ధిమాన్ ప్రాతినిథ్యం వ‌హిస్తున్నాడు.
అయితే వ‌చ్చే ఏడాది సీజ‌న్‌కు ముందు అత‌డిని గుజ‌రాత్ విడిచిపెట్టింది. ఈ క్ర‌మంలో అత‌డు ఐపీఎల్‌-2025 మెగా వేలంలో త‌న పేరును న‌మోదు చేసుకోలేదని తెలుస్తోంది. సాహా తన చివరి టెస్టు 2021లో న్యూజిలాండ్‌పై ఆడాడు.

అయితే టెస్టు క్రికెట్‌లో భార‌త్ తరుపున అత్యుత్త‌మ వికెట్ కీప‌ర్ల‌లో స‌హా ఒక‌డ‌ని చెప్పుకోవ‌చ్చు. ధోని రిటైర్మెంట్ త‌ర్వాత సాహా భార‌త టెస్టు జ‌ట్టులో రెగ్యూల‌ర్ వికెట్ కీప‌ర్‌గా కొన‌సాగాడు. వృద్ధిమాన్ సాహా భారత్ తరపున 40 టెస్టులు ఆడి 1353 పరుగులు చేశాడు.
అత‌డి టెస్టు కెరీర్‌లో మూడు సెంచ‌రీలు ఉన్నాయి. అదేవిధంగా .. 9వన్డేలు ఆడి 41 ప‌రుగులు చేశాడు. ఇక ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్, చెన్నై,కోల్ కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ ,స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ జట్ల తరుపున ఆడిన సాహా మొత్తంగా 170 మ్యాచ్‌లు ఆడాడు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments