Home ఇంటర్నేషనల్ కెనడా బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయంఫై దాడి…

కెనడా బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయంఫై దాడి…

0
కెనడా బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయంఫై దాడి…
Attack on Hindu temple in Brampton, Canada

కెనడాలో హిందువుల ఆలయాలపై దాడులు ఏ మాత్రం ఆగడం లేదు.అయితే కొంతకాలంగా ఆ దేశంలో వున్నా హిందూ ఆలయాలే లక్ష్యంగా వరుస దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయంలో విధ్వంసం సృష్టించారు.అక్కడికి వచ్చిన భక్తులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.అయితే ఇలా వరుసగా దాడులు జరుగుతుండడంతో కెనడాలోని హిందువులు తీవ్ర భయాందోళనలో వున్నారు.

బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయం, భక్తులపై జరిగిన దాడి ఘటనపై కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో తన స్పందన తెలిపారు . ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. తమ దేశంలోని ప్రజలు అన్ని మతాలను పాటించే హక్కులను మేము కాపాడతామని పేర్కొన్నారు. ఈ సంఘటన ఫై తక్షణమే స్పందించి దర్యాప్తు చేపట్టాలని పోలీసులన ట్రూడో ఆదేశించారు.

మరోవైపు బ్రాంప్టన్‌ మేయర్‌ ఈదాడి ఘటనపై తీవ్రంగా స్పందించారు. హిందూ ఆలయంలో జరిగిన దాడి ఘటన విని ఆందోళన చెందినట్లు తెలిపారు. కెనడాలో మత స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కు అని పేర్కొన్నారు. దాడులకు తెగబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దోషులుగా తేలిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here