Monday, June 23, 2025
Google search engine
Homeఎడ్యుకేషన్జర్మనీలో స్టాఫ్‌నర్స్‌ ఉద్యోగాలు..

జర్మనీలో స్టాఫ్‌నర్స్‌ ఉద్యోగాలు..

  • టామ్‌కామ్‌ ఇంటర్వ్యూలు
  • శిక్షణతోపాటు నియామకాలు..
  • వెల్లడించిన తెలంగాణ ఓవర్సేస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్..

జర్మన్‌ భాషలో శిక్షణ, నర్సింగ్‌ విద్యతోపాటు స్టాఫ్‌నర్స్‌ ఉద్యోగాలకు తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ లిమిటెడ్‌ (టామ్‌కామ్‌) ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నది. 18 నుంచి 30 ఏండ్లు కలిగిఉండి ఎస్సెస్సీ, ఇంటర్మీడియెట్‌లో కనీసం 60 శాతం మార్కులు పొందినవారు అర్హులు. హైదరాబాద్‌లోని టామ్‌కామ్‌ క్యాంపస్‌లో 8 నెలలపాటు అభ్యర్థులకు బీ2 స్థాయి వరకు జర్మన్‌ భాషలో శిక్షణ ఇస్తారు. అనంతరం మూడేండ్లు జర్మనీలో నర్సింగ్‌ డిప్లొమా కోర్సులో చేర్పిస్తారు. కోర్సు సందర్భంగా నెలకు సుమారు రూ.లక్ష వరకు ైస్టెపెండ్‌ అందిస్తారు. కోర్సు పూర్తయ్యాక జర్మనీ హాస్పిటల్స్‌లో నెలకు రూ. 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు జీతంతో స్టాఫ్‌నర్స్‌ ఉద్యోగం ఇస్తారు.

ప్రస్తుతం 42 మందితో కూడిన రెండు బ్యాచ్‌లు విజయవంతంగా నడుస్తుండగా, మూడో బ్యాచ్‌ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు టామ్‌కామ్‌ సీఈఓ తెలిపారు. ఎంపికకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని, పూర్తివివరాలకు 6302292450, 7901290580 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. టామ్‌కామ్‌ వెబ్‌సైట్‌ను సం ప్రదించాలన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments