- మహిళను కలవడానికి వచ్చిన వ్యక్తిని కొట్టిన అత్తింటివారు..
- దెబ్బలు తాళలేక ప్రాణం విడిచిన వ్యక్తి..
- ఎంక్వయిరీ చేస్తున్న పోలీసులు..
మహిళతో ఒక వ్యక్తికి వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆమె అత్తింటి కుటుంబం అనుమానం వ్యక్తం చేసింది. ఆ మహిళను కలిసేందుకు ఆ గ్రామానికి వచ్చిన అతడ్ని కొందరు వ్యక్తులు కొట్టి చంపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజస్థాన్‌లోని నీమ్ క థానా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బన్సూర్‌లో నివాసముంటున్న 25 ఏళ్ల ముఖేష్ కుమార్ మీనా టెంట్ వ్యాపారం చేస్తున్నాడు. ఏడాది కిందట సమీపంలోని రావత్ మజ్రా గ్రామంలో పని కోసం వెళ్లాడు. ఈ సందర్భంగా ఆ గ్రామానికి చెందిన ఒక మహిళ అతడికి పరిచయమైంది.
కాగా, అక్టోబర్ 16న రాత్రివేళ ముఖేష్ కుమార్ మీనా ఆ గ్రామానికి వెళ్లాడు. ఆ మహిళను కలిసేందుకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో ఆ మహిళతో అతడికి వివాహేతర సంబంధం ఉందని ఆమె అత్తింటి వారు అనుమానించారు. ముఖేష్‌ను పట్టుకుని బంధించి దారుణంగా కొట్టారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న ముఖేష్‌ను హాస్పిటల్‌కు తరలించారు. అయితే అప్పటికే అతడు మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ నేపథ్యంలో మృతుడి సోదరి ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. ఆరుగురు వ్యక్తులపై కిడ్నాప్, హత్య కేసు నమోదు చేశారు. ఆ మహిళ అత్తమామలతో సహా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు