Home స్పోర్ట్స్ మనసు మార్చుకున్న విరాట్ కోహ్లీ? ఐపీల్ 2025 లో కెప్టెన్ గా విరాట్ కోహ్లీ…?

మనసు మార్చుకున్న విరాట్ కోహ్లీ? ఐపీల్ 2025 లో కెప్టెన్ గా విరాట్ కోహ్లీ…?

0
86
indian cricket player virat kohli
Virat Kohli has changed his mind? Virat Kohli as captain in IPL 2025...?

ఐపీఎల్‌ 2025 ఆటగాళ్ల రిటెన్షన్‌ జాబితా సమర్పణకు అక్టోబర్‌ 31 వరకు చివరి సమయం. ఈ సమయంలో ఏ ఫ్రాంచైజీ ఏ ఏ ఆటగాళ్లను అట్టి పెట్టుకుంటోందో అని ఐ.పి .ల్ అభిమానులు ఉత్కంఠగ ఎదురు చూస్తున్నారు. అయితే ఒక్కో ఫ్రాంచైజీ ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే వెసులుబాటు ఉంది.

ఇందులో గరిష్టంగా ఐదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు అవకాశం ఉంటుంది.
రిటెన్షన్‌ లిస్ట్‌ ప్రకటించబోయే నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు తాము ఎవరెవరిని రిటైన్‌ చేసుకునే జాబితాను దాదాపుగా ఖరారు చేసుకున్నాయి.అయితే కొన్ని ఫ్రాంచైజీలు కెప్టెన్లను కూడా వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నాయి.అయితే ఈ జాబితాలో ఆర్సీబీ కూడా ఉన్నట్లు సమాచారం​. ఆర్సీబీ కెప్టెన్‌ ఫాఫ్‌ డెప్లెసిస్‌ను వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
అయితే ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌ మరోసారి విరాట్‌ను కెప్టెన్ చేయాలని చూస్తుంది అని సమాచారం. కెప్టెన్సీ బాధ్యతలు తిరిగి చేపట్టేందుకు విరాట్‌ కూడా ఒప్పుకున్నాడని తెలుస్తుంది . కోహ్లీ 2021 సీజన్‌ అనంతరం ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నడు. అప్పటి నుండి డుప్లెసిస్‌ ఆర్సీబీ కెప్టెన్‌గా కొనసాగాడు. అయితే 2025 ఐపీల్ లో కోహ్లీ కెప్టెన్ అయితే బాగుంటుంది అని అయన అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here