ఈ పానీయం తాగండి మధుమేహం కంట్రోల్ అవుతుంది..
ఆహార వ్యవహారాలను మార్చేసే వ్యాధి ఇది..
చియా సీడ్స్ కలిపి మజ్జిగ తాగడం ఎంతో ఉత్తమం..
మధుమేహం చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. చిన్న పెద్ద వయసు తేడా లేకుండా మధుమేహం బారిన పడుతున్న వారు చాలామంది ఉన్నారు. అయితే మధుమేహం సమస్య ఒకసారి వచ్చిందంటే దాన్ని నయం చేయడం కుదరదని, ఇది దీర్ఘకాల సమస్య అని అంటుంటారు. కానీ మధుమేహం ఉన్నవారు రోజూ ఒక్క గ్లాసు కింద పేర్కొన్న పానీయం తాగితే దెబ్బకు మధుమేహం కంట్రోల్ లో ఉంటుందట. ఇంతకీ మధుమేహానికి చెక్ పెట్టే ఆ డ్రింక్ ఏంటో.. అది ఎలా పని చేస్తుందో తెలుసుకుంటే..
మధుమేహం ఒక వ్యక్తి మొత్తం ఆహార విహారాలను తారుమారు చేసే సమస్య. మధుమేహంతో బాధపడేవారు ఇతర అనారోగ్య సమస్యలకు కూడా చాలా తొందరగా గురవుతుంటారు. కానీ మధుమేహానికి చెక్ పెట్టాలంటే మజ్జిగ బాగా సహాయపడుతుంది. ఇప్పట్లో చాలామంది ఆహారంలో పెరుగును మాత్రమే తీసుకుంటున్నారు. కానీ మధుమేహం ఉన్నవారు ప్రతి రోజూ ఒక గ్లాసు మజ్జిగను తాగాలి. మజ్జిగ మధుమేహం ఉన్నవారికి అద్బుతమైన ఔషధంలా పని చేస్తుందట. అంతేకాదు.. ఈ మజ్జిగలో కూడా చియా విత్తనాలను జోడించి తీసుకోవాలి.
మజ్జిగలో ఒక టేబుల్ స్పూన్ నానబెట్టిన చియా గింజలను కలిపి రోజూ తాగాలి. ఇలా చేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు రెండు రెట్లు వేగంగా నార్మల్ అవుతాయి. భోజనం చేసిన తరువాత ఒక గ్లాసు మజ్జిగలో ఒక టేబుల్ స్పూన్ చియా గింజలు కలిపి తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. చియా విత్తనాలలో యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. చియా విత్తనాలను ఆహారంలో భాగం చేసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలే కాదు.. ఎముకలు, దంతాలు, దృఢంగా ఉంటాయి.
హార్మోన్ల అసమతుల్యత సమస్యతో ఇబ్బంది పడేవారు చియా విత్తనాలను ఆహారంలో తీసుకుంటే సమస్య తగ్గుతుంది. చియా విత్తనాలలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, మెగ్నీషియం, కాల్షియం హార్మోన్ల పనితీరును సక్రమంగా చేస్తాయి. రక్తపోటును కూడా నియంత్రణలో ఉంచుతాయి.