Home నేషనల్ జమిలి ఎలక్షన్ దిశగా అడుగులు వేస్తున్నాము:ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

జమిలి ఎలక్షన్ దిశగా అడుగులు వేస్తున్నాము:ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

0
57
modi speach
Prime Minister Narendra Modi said that we are taking steps towards Jamili election.

గుజరాత్ లోని కేవడియాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిసందర్బంగా నిర్వహించిన సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ముందుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళులర్పించారు. తర్వాత సభలో మోడీ ప్రసంగిస్తూ… వన్ నేషన్-వన్ ట్యాక్స్, వన్ నేషన్-వన్ పవర్ గ్రిడ్ , వన్ నేషన్ -వన్ రేషన్ కార్డు విధానం తెచ్చాం..
వన్ నేషన్- వన్ ఎలక్షన్ కూడా తీసుకువస్తామని ఆయన బలంగా చెప్పారు. ఎన్నికలతో దేశ ప్రగతి కుంటుపడుతోందన్నారు. గత ప్రభుత్వాలు తమ విధానాలతో దేశాన్ని వెనకపడేలా చేశాయని విమర్శించారు. దేశ ఐక్యతను దెబ్బతీసేందుకు బయటి, లోపలి శక్తులు బలంగా ప్రయత్నిస్తున్నాయని ఆయన విమర్శించారు.
ఈ కుట్రలను సాగనివ్వబోమని ఆయన అన్నారు. జమిలి ఎలక్షన్ దిశగా అడుగులు వేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. జమిలి ఎలక్షన్ సివిల్ కోడ్ తో దేశంలో వివక్షకు తెరపడుతోందన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here