Home తెలంగాణ లకడీకాపూల్ వరదకు చెక్..

లకడీకాపూల్ వరదకు చెక్..

0
60
Additional Commissioner of Traffic in Lakkadikapool area facing flood threat Hydra Commissioner AV Ranganath along with Vishwaprasad once again conducted a field level inspection on Friday.. Hydra, Traffic, GHMC, Jalmandal officials and staff participated in this inspection.
Additional Commissioner of Traffic in Lakkadikapool area facing flood threat Hydra Commissioner AV Ranganath along with Vishwaprasad once again conducted a field level inspection on Friday.. Hydra, Traffic, GHMC, Jalmandal officials and staff participated in this inspection.
  • కొత్త పైపులైన్ తోనే పరిష్కారం లభిస్తుందని నిర్ణయం..
  • మరోసారి ఈ ప్రాంతాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాధ్..
  • ఈ కార్యక్రమంలో పాల్గొన్న ట్రాఫిక్ అదనపు కమిషనర్ విశ్వ ప్రసాద్..

వరద ముప్పును ఎదుర్కొంటున్న లకడికాపూల్ ప్రాంతంలో ట్రాఫిక్‌ అదనపు కమిషనర్ పి. విశ్వప్రసాద్ గారితో కలిసి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గారు మరోసారి శుక్ర‌వారం నాడు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేశారు.. ఈ ప‌రిశీల‌న‌లో హైడ్రా, ట్రాఫిక్‌, జీహెచ్‌ ఎంసీ, జ‌ల‌మండ‌లి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.. టెలిఫోను భ‌వ‌న్‌వైపు వెళ్లే మార్గంలో ఉన్న ద్వార‌కా హోట‌ల్ ప‌రిస‌రాల నుంచి మెహిదీప‌ట్నం వైపు వెళ్లే మార్గంలో ఉన్న ల‌క్కీ రెస్టారెంట్ వ‌ర‌కూ జ‌ల‌మండ‌లికి చెందిన ఎయిర్‌టెక్ మెషిన్‌తో వ‌రుస‌గా మ్యాన్‌హోళ్ల ప‌రిశీల‌న‌ చేశారు.. స్ట్రాం వాటర్ పైపులన్లలో పేరుకుపోయిన పూడికను తొలగించినా పరిష్కారం కానీ సమస్య. దశాబ్దాల క్రితం నిర్మించిన వ‌ర‌ద‌నీటి పైపు లైన్లు, కాలువలు పూర్తిగా శిథిలం అయిన‌ట్టు గుర్తించారు అధికారులు.

లకడికాపూల్ మెట్రో పిల్లర్ 1211 వద్ద బ్లాక్ అయిన స్ట్రాం వాటర్ పైపులైన్… అలాగే ల‌క‌డికాపూల్ నుంచి మెహిదీప‌ట్నం వైపు వెళ్లే వంతెన ముందు భాగంలో శిథిల‌మైన పైపులైను. శిథిల‌మైన వ‌ర‌ద నీటి పైపు లైను/ కాలువ‌ స్థానంలో కొత్తగా పైపు లైన్లు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు.. అప్పటికప్పుడు జీహెచ్ఎంసీ కమిషనర్ తో మాట్లాడి కొత్త లైన్ల ఏర్పాటుపై చర్చించిన రంగనాథ్. యుద్ధ‌ప్రాతిప‌దిక‌న కొత్త‌గా పైపులైన్లు నిర్మించాల‌ని నిర్ణ‌యం. వారం రోజుల్లో ప‌నులు ప్రారంభించేందుకు స‌న్నాహాలు. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ఒక‌టి రెండు రోజుల్లో ప‌నులు పూర్తి చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు..

ఇదే విధంగా న‌గ‌రంలో వ‌ర‌ద ముప్పు తీవ్రంగా ఉన్న 30 ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించి వ‌చ్చే వ‌ర్షాకాలానికి అక్క‌డ స‌మ‌స్య త‌లెత్త‌కుండా చూడాల‌ని నిర్ణయించారు.. గత మంగ‌ళ‌వారం లకడికాపూల్ ప్రాంతంలో వాటర్ లాగింగ్ పాయింట్లను పరిశీలించి శుక్ర‌వారం అదే ప్రాంతానికి వ‌చ్చి స‌మ‌స్య ప‌రిష్కారానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ ఏవీ రంగ‌నాథ్ గారు, విశ్వ‌ప్ర‌సాద్‌ లకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు స్థానికులు. ల‌క‌డికాపూల్ చౌర‌స్తాలో ద‌శాబ్దాల క్రితం వేసిన వ‌ర‌ద నీటి పైపులైన్లు పూర్తిగా శిథిల‌మ‌వ్వ‌డంతో 20 ఏళ్లుగా ఈ స‌మ‌స్య ఉంద‌ని ఫిర్యాదు చేసిన స్థానికులు, దుకాణ‌దారులు. వ‌ర్షం వ‌స్తే ల‌క‌డికాపూల్ చౌర‌స్తాలో వ‌ర‌ద నీరు నిలిచిపోయి.. త‌మ దుకాణాల్లోకి వ‌ర‌ద నీరు చేరుతుందంటూ మొరపెట్టుకున్నారు స్థానిక వ్యాపారులు. ఎట్ట‌కేల‌కు వ‌ర‌ద ముప్పు తొల‌గించేందుకు జ‌రుగుతున్న ప్ర‌య‌త్నాల‌ప‌ట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు..

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here