Thursday, July 17, 2025
Google search engine
Homeట్రెండింగ్‌మరోసారి జారిపోయిన అమెరికా అధ్యక్షా పీఠం..

మరోసారి జారిపోయిన అమెరికా అధ్యక్షా పీఠం..

అందని ద్రాక్షపండుగా మారిన కోరిక..
పోరాటం చేసినా ఫలితం దక్కలేదు..
అయినా తగ్గని ఆత్మవిశ్వాసం..
ట్రంప్ ప్రభుత్వానికి సహకరిస్తామని హామీ..

అమెరికా అధ్యక్ష పీఠాన్ని అతివలు అధిరోహించే అవకాశం మరోసారి చేజారింది. 248 ఏండ్ల ఆ దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మహిళలెవరూ ఈ స్థానాన్ని ఒక్కసారి కూడా చేజిక్కించుకోలేక పోయారు. 2024 అధ్యక్ష ఎన్నికలతో ఆ కల నెరవేరుతుందని చాలామంది భావించినా డెమోక్రాటిక్‌ అభ్యర్థి కమలా హారిస్‌ విజయానికి చేరువగా వచ్చినా దానిని అందుకోలేకపోయారు. గతంలో కూడా అమెరికా అధ్యక్ష స్థానానికి కొంతమంది మహిళలు పోటీపడినా ఎవరూ విజయం సాధించలేక పోయారు. మార్గరేట్‌ చేస్‌ స్మిత్‌, షెల్లీ చిసమ్‌ అధ్యక్ష పీఠానికి పోటీపడ్డారు. 2016లో హిల్లరీ క్లింటన్‌ విజయానికి చేరువగా వచ్చి ఓటమి చెందారు. అప్పటి ఎన్నికల్లో ఆమె ట్రంప్‌ కంటే 30 లక్షల ఓట్లు ఎక్కువ పొందారు. కానీ ఎలక్టోరల్‌ కాలేజీలో ఆమెకు మెజారిటీ దక్కలేదు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments