Saturday, January 24, 2026
Google search engine
Homeతెలంగాణలీకైన దేవాదుల గేట్ వాల్..

లీకైన దేవాదుల గేట్ వాల్..

ఎగిసిపడిన నీరు..
పెద్దకోడెపాక శివారులో లీక్..
నీటితో నిండిపోయిన పంట పొలాలు..
ఎక్కువ ఒత్తిడితో నీటి ప్రవాహం జరగడమే కారణం..

హనుమకొండ జిల్లా శాయంపేటలో దేవాదుల గేట్‌వాల్‌ లీకైంది. దీంతో నీరు ఉవ్వెత్తున ఎగసిపడింది. జోగంపల్లి శివారులోని చలివాగు ప్రాజెక్టు నుంచి ధర్మసాగర్‌కు నీటిని తరలించేందుకు ఫేజ్‌-2లో భాగంగా పైప్‌లైన్‌ నిర్మాణం చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం ఉయదం శాయంపేట మండలం పెద్దకోడెపాక శివారులో గేట్‌వాల్‌ లీకైంది. దీంతో ఒక్కసారిగా నీరు అంత ఎత్తుకు ఎగసిపడింది. సమీపంలో ఉన్న పంట పొలాలు నిండిపోయాయి.

కాగా, చలివాగు ప్రాజెక్టు వద్ద ఉన్న దేవాదుల సబ్‌స్టేషన్‌లో విద్యుత్‌ సమస్య తలెత్తి మోటార్ల నుంచి ఎక్కువ ఒత్తిడితో నీటి ప్రవాహం జరగడం గేట్‌వాల్‌ లీకైనట్లు అధికారులు తెలిపారు. వెంటనే మోటార్లను నిలిపివేసి మరమ్మతులు చేపట్టినట్లు వెల్లడించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments