ఎల్బీనగర్:
హైదరాబాద్ శ్రీ నగర్ కాలనీలోని ఆశ్రయ్ ఆకృతి హాస్పిటల్ యాజమాన్యం ఎన్టీఆర్ నగర్ లోని చిత్రా లేఅవుట్ లో ఉన్న అనాథ విద్యార్థి గృహంలో ఉన్న 100 మంది విద్యార్థులకు ఉచితంగా
ఈఎన్టి వైద్య పరీక్షలు, అలాగే వైద్యపరంగా అవసరమైన విద్యార్థులకు చెవి వినికిడి పరీక్షలు చేశారు. సమస్యలను గుర్తించి, అవసరమైన విద్యార్థులు అందరికీ ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అంతేకాకుండా కొందరి విద్యార్థులకు తదుపరి పరీక్షలు చేయుటకు వారిని పంజగుట్టలోని ఆశ్రయ్ ఆకృతి హాస్పిటల్ కు పంపించాలని వైద్య పరీక్షలకు హాజరైన డాక్టర్లు సూచించారు.ఈ సందర్భంగా హాజరైన ప్రాజెక్టు కోఆర్డినేటర్ హరికృష్ణ మాట్లాడుతూ, ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించుటకు మల్టీ నేషనల్ కంపెనీ అయిన ఆప్టం సంస్థ తమ నిధులను సమకూర్చుతున్నదని తెలిపారు. ఈఎన్టి వ్యాధులు మరియు వినికిడి సమస్యలు రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తలు, తీసుకోవలవలసిన తగిన చర్యల గురించి హాజరైన డాక్టర్లు, విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో గృహ అధ్యక్షులు మార్గం రాజేష్ , ఈఎన్టి డాక్టర్ అమూల్య ఆడియోలాజిస్ట్ పి. భార్గవ్, సైకాలజిస్ట్ జి.కే. మహేష్
హాజరయ్యారు.


