- యువతి ముఖంపై చిన్న చిన్న గాయాలు….
- ఆనుపత్రిలో చేర్చిన ప్రియుడు అక్కడి నుండి పారారు….
- 22 భారత శక్తి శేరిలింగంపల్లి 01 మృతి చెందిన యువతి ఆధార్ కార్డు.
శేరిలింగంపల్లి :
ఓయో హోటల్లో యువతి అనుమానస్పదంగా మృతి చెందిన సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ వరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన విమాల ప్రకారం కొత్తగూడలోని అపోలో ఆసుపత్రి నుండి అందిన సమాచారం ప్రకారం న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంకు చెందిన షారోన్ నిఖితా టోప్నో (29), ప్రైవేట్ ఉద్యోగిని. ఆమె ప్రియుడు శ్రీనివాస రవితేజతో కలిసి ఓయో యాప్ ద్వారా సిద్దిక్నగర్లోని రోడ్డు నెంబర్ 5లోని ఓఎన్ఎల్ఎన్ టెర్మినన్లోని ఓయో హోటల్ రూమ్ నెంబర్ 304ని బుక్ చేసుకున్నారు. అర్థరాత్రి 2 గంటల సమయంలో యువతి అవస్మారక స్థితిలో కనిపించడంతో ఆమెను కొత్తగూడలోని అపోలో ఆసుపత్రికి తరలించిన ప్రియుడు శ్రీనివాస రవితేజ. అక్కడ వైద్యులు ఆమెను పరీక్షించి అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలియజేశారు. ఈ ఘటన తర్వాత షారోన్ నిఖితా మృతి చెందిందన్న విషయం తెలియగానే యువతి ప్రియుడు శ్రీనివాస రవితేజ ఆసుపత్రి నుండి పారిపోయాడు. మృతురాలు షారోన్ నిఖితా టోప్నో ముఖంపై చిన్న గాయాలు కనిపించాయన్నారు. ఆధారాలతో హోటల్ గదిని సందర్శించి సాక్షాధారాల సేకరించి వాటిని భద్రపరిచడం జరిగిందన్నారు. సంఘటన తర్వాత రవితేజ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడన్నారు. అతని ఆచూకి కనుగొని పట్టుకుంటామన్నారు. అతనిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు రంగంలోకి దించడం జరిగిందన్నారు. మృతదేహంను ఉస్మానియ ఆసుపత్రికి తరలించి పోస్ట్మార్టం అనంతరం యువతి కుటుంబ సభ్యులకు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరుగుతుందన్నారు.


