Wednesday, September 23, 2026
Google search engine
Homeఇంటర్నేషనల్ఇంటిగ్రేటెడ్ న్కూల్ కాంప్లెక్స్ నిర్మాణంకు స్థల సేకరణ.... రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ కొప్పశెట్టి కిరణ్మయి.

ఇంటిగ్రేటెడ్ న్కూల్ కాంప్లెక్స్ నిర్మాణంకు స్థల సేకరణ…. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ కొప్పశెట్టి కిరణ్మయి.

శేరిలింగంపల్లి

ఇంటిగ్రేటెడ్ న్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి స్థల పరిశీలిస్తున్న రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్మయి.భారత శక్తి శేరిలింగంపల్లి సెప్టెంబర్ 22 : మియాపూర్ సర్కిల్ పరిధిలోని హుడా కాలనీలో ప్రతిపాదిత క్యూర్ ఏరియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు స్థల సేకరణ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా అదనపు కాలెక్టర్ కొప్పిశెట్టి కిరణ్మయితో పాటు శేరిలింగంపల్లి జోనల్

కమిషనర్ నారాయణ్ అమిత్, మియాపూర్ సర్కిల్ ఉప కమిషనర్ శ్రీనివాస్, తహసీల్దార్ మహిపాల్ రెడ్డి, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాల అధికారులు ఉమ్మడిగా క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఈ నేపథ్యంలో పాఠశాల కంప్లెక్స్ నిర్మాణానికి అత్యంత అనువైన, విస్తారమైన స్థలాన్ని గుర్తించేందుకు హుడా కాలనీలో పలు ప్రభుత్వ స్థలాలను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు రాకపోకల సౌకర్యం, భవిష్యత్ అవసరాలు, నిర్మాణానికి సాంకేతిక అనుకూలతలను దృష్టిలో ఉంచుకొని నివేదికలలను సిద్దం చేయాలని సంబంధిత అధికారులను ఆదనపు కలెక్టర్ ఆదేశించారు. అన్ని ఆధునిక వసతులతో సమగ్ర విద్యాభివృద్ధి లక్ష్యంగా ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ లను ప్రతిపాదించినట్లు తెలిపారు. త్వరలోనే స్థల ఎంపికను పూర్తి చేసి నిర్మాణ పనులకు శ్రీరాం చుడతామన్నారు. ఇందులో టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల ఉన్నతాధికారులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments