Tuesday, July 21, 2026
Google search engine
Homeతెలంగాణఆగస్టు 19న పటాన్‌చెరు యాదవ సంఘం ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవం

ఆగస్టు 19న పటాన్‌చెరు యాదవ సంఘం ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవం

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు:

పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని గోకుల్ నగర్ లో నాలుగు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన యాదవ సంఘం కళ్యాణ మండపాన్ని ఆగస్టు 19న ప్రారంభించబోతున్నట్లు పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం మాజీ ప్రజా ప్రతినిధులు, యాదవ సంఘం ప్రతినిధులు, బల్దియా ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఫంక్షన్ హాల్ ను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ
పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఫంక్షన్ హాళ్లు నిర్మించాలన్న లక్ష్యంతో నియోజకవర్గం వ్యాప్తంగా కళ్యాణ మండపాలు నిర్మిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా పటాన్‌చెరు పట్టణంలోని యాదవుల కోసం ఆధునిక హంగులతో, పూర్తి సౌకర్యాలతో కళ్యాణ మండపాన్ని నిర్మించినట్లు తెలిపారు. అందరి అభిప్రాయాలకు అనుగుణంగా ఆగస్టు 19న కళ్యాణ మండపాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు శంకర్ యాదవ్, సపానదేవ్, మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, డిఈ కృష్ణవేణి, యాదవ సంఘం అధ్యక్షులు దేవయ్య యాదవ్, వైస్ ప్రెసిడెంట్ మల్లేష్ యాదవ్, శ్రీశైలం యాదవ్, యాదగిరి యాదవ్, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments