ఎల్బీనగర్:
మహేశ్వరం నియోజకవర్గం శ్రీ రామకృష్ణ పురం డివిజన్ అధ్యక్షులు పున్న గణేష్ నేత, ఎన్టీఆర్ నగర్ డివిజన్ అధ్యక్షులు ముప్పిడి లింగస్వామి గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా చిత్రా లేఔట్ కాలనీలో వైఎస్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా గణేష్ నేత మాట్లాడుతూ, 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారం మొదటి సంతకం ఉచిత విద్యుత్తు, రైతుల రుణమాఫీ చేయడం అలాగే ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ 108 లాంటి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత వైయస్ రాజశేఖర్ రెడ్డి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. పేదల పక్షాన వారు చేసిన సేవలు ఇప్పటి కూడా ప్రజల గుండెల్లో నిలిచినవి అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలను గుర్తు చేసుకుంటూ వారి ఆశయాలను ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ముందుకు తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చిలుక ఉపేందర్ రెడ్డి, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండి మధుసూదన్ రావు చిత్రా లేఔట్ కాలనీ మాజీ అధ్యక్షులు, సర్పంచ్ ముస్కు అంజిరెడ్డి,అరవింద్ రెడ్డి ఆంజనేయ స్వామి దేవాలయం చైర్మన్ తలాటి రమేష్ నేత,రామకృష్ణగౌడ్, జెల్ల జగన్నాథం,పెద్ద ఊర సైదులు, వెంకటరమణారెడ్డి, యాదవ రెడ్డి, మహ్మద్, దుబ్బాక శేఖర్, ఎల్లన్న, బిక్షపతి గౌడ్, సుదర్శన్, రమేష్ గౌడ్, ప్రేమ్ నాయక్,షఫీ, పాషా, సమ్మద్, పటేల్, నరసింహ కృష్ణారెడ్డి, రేణుక, మాధవి, పాండు విప్లవ రెడ్డి, సంతోష్, సురేష్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.


