ఎల్బీనగర్
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నగేష్ ఆధ్వర్యంలో మహిళల పోరు బాట కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ నగర్ చౌరస్తా నుండి చింత చెట్టు చౌరస్తా వరకు పాద యాత్ర చేస్తూ నిరసనలు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ,నాయకులు సాజీద్, శ్రీనివాస్ రెడ్డి, రాం నర్సింహా గౌడ్,గొడుగు శ్రీనివాస్, ఊర్మిళ రెడ్డి,సిద్దగోని వెంకటేష్, శ్యామ్ గుప్తా,కంచెర్ల శేఖర్, ఎండి జావీద్,జగన్, బాలుశ్రీ,శ్రీమన్నారాయణ, పెంబర్తి శ్రీనివాస్,రమేష్, నిరంజన్,దశరథ్, కపిల్, దీపక్ తదితరులు పాల్గొన్నారు.



