- ముడుపులు మేసి అక్రమ నిర్మాణాలకు అండగా నిలిచిన అధికారిణి సాయి అర్చన!
- రూ. లక్షల ప్రభుత్వ ఆదాయానికి గండి.. మూడు నివాస అనుమతుల ముసుగులో ఒకటే భారీ వాణిజ్య భవనం!
- ఓసి ఫైర్ ఎన్ఓసీల ఎగవేతకు అధికారుల మాస్టర్ ప్లాన్..
- ఫిర్యాదు చేసి నాలుగు నెలలవుతున్నా మొద్దునిద్ర వీడని ఉన్నతాధికారులు..
- నిబంధనలను తుంగలో తొక్కి లోతైన సెల్లార్ త్రవ్వకాలు.. చుట్టుపక్కల ఆస్తులకు ప్రాణసంకటం!
- మున్సిపల్ ఖజానాకు చేయవలసిన పన్ను సొంత జేబులోకి మళ్లించుకుంటున్న అవినీతి అధికారులు..
- నిఘా విభాగాలు, ఎం.ఎం.సి విజిలెన్స్ అధికారులు అవినీతి పై దృష్టి సారించి అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక ప్రజల డిమాండ్.
- ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ మహతో, ఎం.ఎం.సి కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి దృష్టి సారించాలి,
ఎల్బీనగర్:
మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎల్బీనగర్ జోన్ ఎల్బీనగర్ సర్కిల్ 13 ,రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం కర్మన్‌ఘాట్ పరిధిలో అక్రమ నిర్మాణాల మాఫియా చెలరేగిపోతోంది. నిబంధనలను తుంగలో తొక్కి సాగుతున్న ఈ దందాలకు, ఎల్బీనగర్ జోన్ సర్కిల్-13 టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ సాయి అర్చన అండదండలు మెండుగా ఉన్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. భారీగా ముడుపులు దండుకున్న సాయి అర్చన, కళ్లముందే జరుగుతున్న చట్టవిరుద్ధ పనులను చూసీచూడనట్లు వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
*మోసపూరిత అనుమతుల దందా..
టీకేఆర్ కాలేజ్ బస్ స్టాప్ నుండి హనుమాన్ నగర్ వెళ్లే దారిలో ప
కర్మన్‌ఘాట్ ,హనుమాన్ నగర్ ప్రధాన రహదారి ఆనుకొని ,రోడ్ నెం. 9లోని ప్లాట్ నెం. 32 (తూర్పు & మధ్య భాగాలు), సర్వే నెం. 60 లో అక్రమాల పర్వం తారస్థాయికి చేరింది. 600 గజాల విశాలమైన భూమిని పలు భాగాలుగా విడగొట్టి, ఆక్యుమెంట్స్ సర్టిఫికెట్ ఎగవేయడానికి, వాణిజ్య మార్పిడి రుసుములు, కఠినమైన నిబంధనలను ఎగవేసేందుకు బ్రోకర్ల ద్వారా ఎత్తుగడేశారు. కాగితాలపై వేర్వేరు G+2 నివాస అనుమతులు పొంది, క్షేత్రస్థాయిలో వాటన్నింటినీ కలిపి ఒకే భారీ వాణిజ్య సముదాయాన్ని నిర్మిస్తున్నారు.
క్షేత్రస్థాయి పరిశీలన చేయాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారిణి సాయి అర్చన, నిర్మాణానికి ముందే స్థలాన్ని సందర్శించి సర్వసంగ్యాలు ఎరిగి కూడా భారీ మొత్తంలో లంచాలు స్వీకరించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన మున్సిపల్ మార్టిగేజ్ అవసరాలు, కమర్షియల్ ఇంపాక్ట్ ఫీజులు, లక్షలాది రూపాయల పన్నులను ఎగవేసేలా ఈ అక్రమ తంతుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

*ప్రాణాలను హరిస్తున్న జీరో సెట్బ్యాక్లు..
నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి సెట్బ్యాక్లు పాటించకుండా, ప్రమాదకర రీతిలో లోతైన సెల్లార్ త్రవ్వకాలు జరుపుతున్నారు. అగ్నిమాపక భద్రతా నియమాలను పూర్తిగా గాలికి వదిలేయడంతో చుట్టుపక్కల నివాసాల ప్రజలు తీవ్ర భయాందోళనలో బతుకుతున్నారు. ఎలాంటి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు, మంద్రాటరీ క్లియరెన్సులు లేకున్నా పెద్దఎత్తున వాణిజ్య కార్యకలాపాలు సాగిస్తున్నా, సర్కిల్-13 కార్యాలయం నుంచి కనీస స్పందన కరువైంది.
*నాలుగు నెలలుగా నిస్తేజం.. ఉద్దేశం ఏమిటి?
ఈ అక్రమ నిర్మాణంపై బాధితులు అధికారులకు ఫిర్యాదు చేసి సరిగ్గా నాలుగు నెలలు గడుస్తున్నా, ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక ఉన్న అసలు అంతర్యం ఏమిటో మున్సిపల్ ఉన్నతాధికారులు సమాధానం చెప్పాలి. కిందిస్థాయి అవినీతికి కొమ్ముకాస్తూ, ప్రజాధనాన్ని దోచుకోవడానికి సహకరిస్తున్న అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వెంటనే ఉన్నతాధికారులు చర్యలకు పూనుకోవాలి:
- అక్రమంగా అనుమతులు మంజూరు చేసి, అవినీతికి పాల్పడిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాయి అర్చనపై ఉన్నతాధికారులు తక్షణమే సర్వీసు పరమైన కఠిన చర్యలు తీసుకోవాలి.
- తక్షణ పనుల నిలిపివేత (స్టాప్-వర్క్ ఆర్డర్) ఉత్తర్వులు జారీ చేసి, ఆ అనధికార వాణిజ్య ప్రాంగణాన్ని వెంటనే సీజ్ చేయాలి.
- తప్పుడు పత్రాలతో పొందిన అనుమతులను రద్దు చేసి, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ అంతస్తులను కూల్చివేయాలి.
- మున్సిపాలిటీని మోసగించి, ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టిన బిల్డర్‌తో పాటు సహకరించిన అవినీతి అధికారులపై క్రిమినల్ కేసులు (ఎఫ్ఐఆర్) నమోదు చేయాలి.
ఈ అక్రమాలపై ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి ఉక్కుపాదం మోపుతారా? లేక అవినీతి అధికారుల అండతో సామాన్యుల ప్రాణాలతో చెలగాటాన్ని కొనసాగనిస్తారా? వేచి చూడాల్సిందే!




