Wednesday, September 9, 2026
Google search engine
Homeతెలంగాణకేంద్ర మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన రాక్ టౌన్ కాలనీ ప్రతినిధులు

కేంద్ర మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన రాక్ టౌన్ కాలనీ ప్రతినిధులు

హైదరాబాద్:

కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖా మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డిని రాక్ టౌన్ కాలనీ సంక్షేమ సంఘం మరియు భారతీయ జనతా పార్టీ జి.ఎస్.ఐ. డివిజన్ అధ్యక్షులు ఎర్ర వినోద్ రెడ్డి నేతృత్వంలో కాలనీ ప్రతినిధుల బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ భేటీ సందర్భంగా కేంద్ర మంత్రులకు కాలనీ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై వినతిపత్రం అందజేసి, వారి అమూల్యమైన ఆశీస్సులను స్వీకరించారు.

*సమస్యలపై ప్రత్యేక చర్చ
స్థానిక ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం, మౌలిక వసతుల కల్పన మరియు కాలనీలో పెండింగ్‌లో ఉన్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై కేంద్ర మంత్రితో ప్రతినిధుల బృందం చర్చించింది. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయికి తీసుకువెళ్లే విధానాలపై ఈ సమావేశంలో సమీక్ష జరిపారు.

ఈ కార్యక్రమంలో రాక్ టౌన్ కాలనీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నాగవెల్లి జైపాల్ రెడ్డి, కాలనీ ముఖ్య సభ్యులు గంగాపురం ప్రదీప్ రెడ్డి తదితరులు పాల్గొని కేంద్ర మంత్రిని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments