- క్యూర్ పరిధిలో ఏడాది లో లక్ష ఇళ్ల నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం….
- ఏడాదిలో గృహప్రవేశాలు జరిగేలా ప్రణాళిక,అర్హులైన పేదలకు పారదర్శకంగా లక్కీడిప్ ద్వారా కేటాయింపు….
భారత శక్తి :
శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం మల్కం చెరువు వెనుక, 2.85 ఎకరాలలో (11,551.24 చ.మీ.) నూతనంగా నిర్మించబోయే ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం కొరకు జరిగిన భూమి పూజ కార్యక్రమంలో హౌసింగ్, రెవెన్యూ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, MLC బోగారపు దయానంద్ గుప్తా, యాదవ కో ఆపరేటివ్ చైర్మన్ రఘునాథ్ యాదవ్ , అడిషనల్ కలెక్టర్ శ్రీమతి కిరణ్మయి , హౌసింగ్ PD నాయక్ , RDO శ్రీధర్, తహసీల్దార్ మహిపాల్ రెడ్డి , మాజీ కార్పొరేట్లు దొడ్ల వెంకటేశ్ గౌడ్, జగదీశ్వర్ గౌడ్, నార్నె శ్రీనివాస రావు, ఉప్పలపాటి శ్రీకాంత్ సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి గార్ల తో కలిసి పాల్గొన్న PAC చైర్మన్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరెక పూడి గాంధీ .
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పేదల సొంతింటి కల సాకారానికి శిలాఫలకం నేడు పడబోతోంది. అని, నేడు పేదవాడి పండుగ దినం అని పేదలకోసం అత్యంత ఖరీదైన ఈ ప్రాంతంలో నిర్మించబోయే ఇందిరమ్మ టవర్స్ భూమిపూజ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. ఒక ఏడాదిలో పూర్తి చేయాలని తలపెట్టిన ఈ ప్రాజెక్టు లో ఫేజ్ 1 కింద 480,ఫేజ్ 2 కింద 680 ఇళ్ళు నిర్మించనున్నారు అని తెలియచేశారు.
క్యూర్ పరిధిలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం హైదరాబాద్ గృహ నిర్మాణ రంగంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది.

హైదరాబాద్ మహానగరంలో ఎన్నో ఏళ్లుగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల కలను సాకారం చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం మరో చారిత్రాత్మక అడుగు వేస్తోంది అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికీ శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజల తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నాలుగు టవర్స్ నిర్మించడం జరుగుతుంది. ఒక్కో టవర్‌లో 120 చొప్పున ఫ్లాట్స్ ఉంటాయి. ఒక్కో ఫ్లోర్‌లో 12 ఫ్లాట్స్ ఉండేలా 480 ఫ్లాట్స్ నిర్మాణం జరుగుతుంది అని, ఒక్కో ఫ్లాట్ 528 చదరపు అడుగులు అని,లబ్ధిదారుడు కేవలం రూ. 6 లక్షలు మరియు ప్రభుత్వ సబ్సిడీ: రూ. 5 లక్షలు మరియు భూమి ఉచితంగా ఇస్తుంది అని, ఈ ప్రాంతంలో ఎకరా రూ. 264 – 269 కోట్లు. 2.85 ఎకరాల విలువ సుమారు రూ. 752 – 767 కోట్లు, మార్కెట్ ధర: ఇక్కడ ఒక ఫ్లాట్ బయట కొనాలంటే రూ. 50 లక్షలు, పేదలకు నగరంలోనే, ఉద్యోగాలకు దగ్గరలో సరసమైన, గౌరవప్రదమైన ఇల్లు అందుబాటులోకి వస్తుంద అన్నారు.
ఆటో రిక్షా నడుపుకునే వారికి, ట్యాక్సీ డ్రైవర్లకు లబ్ది చేకూరేలా చూడాలని,,వారికి ట్యాక్సీ నడుపుతూ జీవనం గడుపుతున్నారు అని వారిని దృష్టిలో పెట్టుకొని 4 వీలర్ ఉండటం వలన వారికి ఇందిరమ్మ టవర్స్ లో ఇండ్ల కు అప్లై చేసుకోవడానికి పెసులుబాటు కల్పించాలని నిజమైన అర్హులైన లబ్ధిదారులకు అవకాశం ఇవ్వాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి PAC చైర్మన్ గాంధీ తీసుకువెళ్లడం జరిగినది. దీనికి సానుకూలంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించడం జరిగినది. ట్యాక్సీ వారికి కూడా అవకాశం కల్పిస్తామని మంత్రి తెలియచేశారు .
ఇటీవల లక్కీ డీప్ ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు ఇండ్లు కేటాయించడం జరుగుతుందని, లక్కీ డీప్ ఇటీవల నిర్వహించడం జరిగినది. ఇందిరమ్మ టవర్స్‌లో లబ్ధిదారులకు అందించే ఇళ్లు సౌకర్యవంతంగా, ఆధునిక ప్రమాణాలతో నిర్మించనున్నాం.
ప్రతిపాదిత ఇంటిలో ఒక బెడ్‌రూమ్, హాల్, కిచెన్‌తో కలిపి సుమారు 525 చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటుంది అని PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేశారు.
ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న ఈ ఇళ్లలో లబ్ధిదారుడి పేరుతో అన్‌డివైడెడ్ షేర్ కింద సుమారు 20 నుంచి 25 గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది.
హైదరాబాద్ నగరం నడిబొడ్డున పేదవాడి ఇంటికి పునాది వేయడం అంటే కేవలం ఒక భవనం నిర్మించడం కాదు.. ఒక కుటుంబానికి భద్రత, ఒక తరానికి భరోసా, పేదవాడికి గౌరవంతో కూడిన జీవితం అందించడమే అన్నారు.
హైదరాబాద్‌లో భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో నగరంలోనే సొంత ఇల్లు కావాలనే పేదల ఆకాంక్షను నెరవేర్చేందుకు ఇందిరమ్మ టవర్స్ నిర్మాణాలను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ,.మాజీ కౌన్సిలర్లు, నాయకులు,కార్యకర్తలు ,లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.


