Tuesday, September 22, 2026
Google search engine
Homeతెలంగాణబస్తీ దవాఖానలో బోరు సమస్య పరిష్కారానికి చర్యలు: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

బస్తీ దవాఖానలో బోరు సమస్య పరిష్కారానికి చర్యలు: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

ఎల్బీనగర్:

లింగోజిగూడ డివిజన్ పరిధిలోని కామేశ్వర్ రావు కాలనీలో ఉన్న బస్తీ దవాఖానలో గత ఆరు నెలలుగా నీటి బోరు పంపు ఎండిపోవడంతో నీటి సమస్య తీవ్రంగా నెలకొంది. ఈ విషయాన్ని బస్తీ దవాఖాన సిబ్బంది ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, బస్తీ దవాఖానకు ప్రతిరోజూ ఎంతో మంది రోగులు వైద్య సేవల కోసం వస్తుంటారని ఇలాంటి ఆసుపత్రిలో నీటి కొరత ఉండటం వల్ల రోగులు,సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.ప్రజలకు అందుబాటులో ఉండే వైద్య కేంద్రాల్లో మౌలిక వసతులు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.బోరులో నీరు ఎండిపోవడం వల్ల ఏర్పడిన నీటి సమస్యను వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడి కొత్త నీటి బోరు ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా బస్తీ దవాఖానల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో డివిజన్ భారస అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి,నాయకులు తిలక్ రావు,జగన్నాద్ రెడ్డి, గంగపుత్ర భాస్కర్,శ్రీధర్, హాస్పిటల్ సిబ్బంది ప్రశాంతి, సరిత తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments