గోకుల్ ప్లాట్స్ సర్వే నెంబర్ 78లో మొత్తం 215 ఎకరా భూమి ఉంది. 20 ఎకరాల ఖాళీ భూమి ఉంది.
గోకుల్ ప్లాట్స్ కాలనీలో అధ్యక్షులు సాంబయ్య.
శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి మండల పరిధిలోని గోకుల్ ప్లాట్స్ సర్వే నెంబర్ 78లో ఉన్న 215 ఎకరాల భూములను మియాపూర్ సర్వే నెంబర్ 100, 101 తరహలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూములుగా ప్రకటించాలని గోకుల్ ప్లాట్స్ వెంకటరమణ కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు సాంబయ్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం గోకుల్ ఫ్లాట్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అసోసియేషన్ సభ్యులతో కలిసి ఆయన మాట్లాడుతూ మియాపూర్ గోకుల్ ప్లాట్స్‌కు చెందిన సర్వే నెంబర్ 78లోని 215 ఎకరా భూమి, స్థలం గతంలో నావాబుల కాలం నాటిది కావడంతో దానిని కొందరు ప్రైవేట్ వ్యక్తులు తమదంటు రావడంతో కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేయడంతో దశాబ్దాల కాలం ఇక్కడే నివాసలు ఏర్పరుచుకొని ఉన్నమ్మన్నారు. ఈ భూములను మియాపూర్ సర్వే నెంబర్ 100,101 తరహలోనే గోకుల్ ప్లాట్స్ భూములును ప్రభుత్వం, ప్రభుత్వ భూమిగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. గోకుల్ ప్లాట్స్ కాలనీలో ఏండ్ల తరబడి నివాసాలు ఉంటున్నామని, ప్రభుత్వం గోకుల్ ప్లాట్స్ కాలనీని మియాపూర్ సర్వే నెంబర్ 100, 101 భూములను ప్రభుత్వ భూమిగా ప్రకటించిన తరహలోనే గోకుల్ ప్లాటును కూడా ప్రకటించాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గోకుల్ ప్లాట్స్‌లోని సర్వే నెంబర్ 78లో మొత్తం 215 ఎకరాల ఉండగా అందులో 20 ఎకరాల ఖాళీ స్థలం ఉందన్నారు. ఇదివరకు మియాపూర్ సర్వే నెంబర్లు 100, 101 పరిధిలో దాదాపు 500 ఎకరాలకు పైగా ఉన్న భూమిని ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకొని, ప్రభుత్వ భూమిగా ప్రకటించిన విషయాన్ని కమిటీ సభ్యులు గుర్తు చేశారు. విలువైన ప్రభుత్వ భూములను కాపాడేందుకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులు తక్షణమే క్షేత్రస్థాయి పరిశీలిన చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం లో గుండా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.


