Wednesday, October 28, 2026
Google search engine
Homeతెలంగాణజవహర్ నగర్ డంపింగ్ యార్డు తరలింపే లక్ష్యంగా ఎంపీ ఈటల రాజేందర్ పాదయాత్ర..

జవహర్ నగర్ డంపింగ్ యార్డు తరలింపే లక్ష్యంగా ఎంపీ ఈటల రాజేందర్ పాదయాత్ర..

పాద యాత్రలో పాల్గొన్న బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి

ఎల్బీనగర్

జవహర్ నగర్ డంపింగ్ యార్డు కారణంగా కాలుష్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న లక్షలాది మంది ప్రజలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ చేపట్టిన పాదయాత్రలో గడ్డిఅన్నారం డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్, బీజేపీ నాయకులు బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డు తరలింపు, కాలుష్య నియంత్రణ, ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఎంపీ ఈటల రాజేందర్ బాధిత ప్రజల పక్షాన పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఎన్నో ఏళ్లుగా డంపింగ్ యార్డు ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి, వాటికి శాశ్వత పరిష్కారం సాధించడమే ఈ పాదయాత్ర ప్రధాన ఉద్దేశం. ప్రజల పక్షాన నిలబడి, జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం సాధించాలనే లక్ష్యంతో ఎంపీ ఈటల రాజేందర్ చేపట్టిన పాదయాత్రకు మద్దతుగా నిలుస్తూ, ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం తన వంతు కృషి కొనసాగిస్తానని బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments