Monday, October 12, 2026
Google search engine
Homeతెలంగాణతెలంగాణ అస్తిత్వ బతుకమ్మ సంబురాల మహా ప్రస్థానం: లలిత కళా తోరణంలో ఘనంగా 'అటుకుల బతుకమ్మ'...

తెలంగాణ అస్తిత్వ బతుకమ్మ సంబురాల మహా ప్రస్థానం: లలిత కళా తోరణంలో ఘనంగా ‘అటుకుల బతుకమ్మ’ వేడుకలు!

  • మట్టి వాసనల పరిమళం.. మహిళా శక్తి స్వయంప్రతిపత్తికి ప్రతీక
  • తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటిన శాస్త్రీయ, జానపద కళారూపాలు
  • వారసత్వ పరిరక్షణే ధ్యేయంగా పర్యాటక శాఖ ముందడుగు

హైదరాబాద్

ప్రకృతి మాతను ఆరాధిస్తూ, మహిళా లోకం ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే తెలంగాణ మహా పండుగ బతుకమ్మ సంబురాలు రాష్ట్ర రాజధానిలో పరాకాష్టకు చేరాయి. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నగరంలోని చారిత్రక లలిత కళా తోరణంలో ‘అటుకుల బతుకమ్మ’ వేడుకలు అసాధారణ రీతిలో, అత్యంత వైభవంగా రూపుదిద్దుకున్నాయి. పరస్పర సహకారం, జీవవైవిధ్యం, ప్రకృతితో మానవుడి సహజీవనానికి నిలువెత్తు రూపమైన ఈ వేడుకలు అశేష జనవాహినిని కట్టిపడేశాయి.

*సాంస్కృతిక సవ్వళ్లు.. కళా వైభవం
తెలంగాణ నేల పుట్టుకలోని వీరత్వాన్ని, త్యాగాలను, పండుగ విశిష్టతను ప్రతిబింబించేలా ఈ వేడుకల్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉర్రూతలూగించాయి. ప్రముఖ కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన భారతీయ శాస్త్రీయ కళా వైభవాన్ని అంబరాన్నంటేలా చేసింది. ప్రతి కదలికలోనూ కనిపించిన హావభావాలు, లయబద్ధమైన విన్యాసాలు ప్రేక్షకులను పరవశింపజేశాయి. మరోవైపు, తెలంగాణ నేల గుండెచప్పుడును వినిపించిన సంప్రదాయ డప్పుల మోతలు, డోలు వాయిద్యాలు వేడుకల ప్రాంగణంలో హోరెత్తాయి. ఈ కళా రూపాల హోరులో పండుగ శోభ తారాస్థాయికి చేరింది.

*అస్తిత్వ పరిరక్షణే లక్ష్యంగా పర్యాటక శాఖ అడుగులు:
జానపద కళలు, స్థానిక సంప్రదాయాలు, శాస్త్రీయ నృత్యరీతులు, అరుదైన సాంస్కృతిక గుర్తింపులను భావితరాలకు అందించడంలో ఈ వేడుకలు ఒక మైలురాయిగా నిలిచాయి. రాష్ట్ర సమృద్ధమైన అమూర్త సాంస్కృతిక వారసత్వాన్ని పదికాలాల పాటు పరిరక్షించడం, పర్యాటక ప్రపంచానికి తెలంగాణ ఖ్యాతిని చాటిచెప్పడమే ప్రధాన ధ్యేయంగా పర్యాటక శాఖ ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రకృతితో ముడిపడిన ఈ వేడుకల ద్వారా తెలంగాణ మహిళా శక్తి విశ్వవ్యాప్తంగా తన విశిష్టతను మరోసారి చాటిచెప్పింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments