దిల్సుఖ్‌నగర్ సంతోష్ మాత దేవాలయంలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి
భారత శక్తి:
నాగోల్ పోలీస్ స్టేషన్ జి.ఎస్.ఐ డివిజన్ పరిధిలోని దేవాలయాలకు ప్రత్యేక భద్రత కల్పించి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరుతూ బీజేపీ జి.ఎస్.ఐ డివిజన్ అధ్యక్షులు ఎర్ర వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నాగోల్ పోలీస్ స్టేషన్ సి.ఐ. మాక్బుల్ జానీ గారికి వినతిపత్రం అందజేశారు.
ఇటీవల దిల్సుఖ్‌నగర్‌లోని సంతోష్ మాత దేవాలయంలో జరిగిన దురదృష్టకర సంఘటనను దృష్టిలో ఉంచుకుని, నాగోల్ పోలీస్ స్టేషన్ జి.ఎస్.ఐ డివిజన్ పరిధిలోని అన్ని దేవాలయాల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని వినతిపత్రంలో కోరారు.
దేవాలయాలు ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు కేంద్రాలైనందున, భక్తులు, ఆలయ సిబ్బంది మరియు ప్రజలకు పూర్తి భద్రత కల్పించేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా దేవాలయాల వద్ద భద్రతా ఏర్పాట్లను సమీక్షించి, అవసరమైన ప్రాంతాల్లో పోలీస్ పెట్రోలింగ్, నిఘా మరియు ఇతర భద్రతా చర్యలను పెంచాలని కోరారు.
దిల్సుఖ్‌నగర్ సంతోష్ మాత దేవాలయంలో జరిగిన ఘటనలు భవిష్యత్తులో మరే ఇతర దేవాలయంలోనూ పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, జి.ఎస్.ఐ డివిజన్ పరిధిలోని అన్ని దేవాలయాల భద్రతను సమీక్షించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఎర్ర వినోద్ రెడ్డి పోలీసు అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో జి.ఎస్.ఐ డివిజన్ జనరల్ సెక్రటరీ గోపాల్ శర్మ, బీజేపీ సీనియర్ నాయకులు సిద్దాల ఐలయ్య, రంగా రెడ్డి జిల్లా కౌన్సిల్ మెంబర్ పాల్వాయి సంజీవ రెడ్డి, మాజీ డివిజన్ అధ్యక్షులు బద్దం బాలకృష్ణ,బీజేపీ నాయకులు శ్రీనివాస్ నేత, నవీన్ రెడ్డి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు



