Wednesday, October 28, 2026
Google search engine
Homeతెలంగాణనాగోల్‌లో చిరుతపులి సంచరిస్తోందంటూ ఫేక్ ఫోటో ప్రచారం

నాగోల్‌లో చిరుతపులి సంచరిస్తోందంటూ ఫేక్ ఫోటో ప్రచారం

ప్రజల్లో భయాందోళనలు సృష్టించిన వ్యక్తిపై కేసు నమోదు

ఎల్బీనగర్

నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆనంద్ నగర్, ఫతుల్లాగూడ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తోందంటూ నకిలీ ఫోటోను సృష్టించి ప్రచారం చేసిన వ్యక్తిపై నాగోల్ పోలీసులు కేసు నమోదు చేశారు.వివరాల్లోకి వెళితే, సోమవారం రోజున ఉప్పల్ ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి చెందిన డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఎం. అనిత ఫిర్యాదు చేశారు. గత శుక్రవారం అర్ధరాత్రి సమయంలో నాగోల్‌లోని ఆనంద్ నగర్, ఫతుల్లా గూడ ప్రాంతంలో ఉన్న భాష్యం స్కూల్ సమీపంలో చిరుతపులి సంచరిస్తోందంటూ ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్, ఉప్పల్‌కు సమాచారం అందింది. దీంతో ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. విచారణలో సచిన్ అనే వ్యక్తి చాట్ జిపిటి ద్వారా చిరుతపులి ఫోటోను కృత్రిమంగా సృష్టించి, దానిని తన యజమానికి పంపించినట్లు గుర్తించారు. సదరు యజమాని ఆ ఫోటోను నాగోల్ ఎస్‌హెచ్‌ఓకు పంపించినట్లు విచారణలో వెల్లడైంది.సదరు వ్యక్తి మద్యం మత్తులో ఉన్న సమయంలో అతడిని నాగోల్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మరుసటి రోజు ఉదయం సంబంధిత ప్రాంతంలో విచారణ చేపట్టగా, అక్కడ చిరుతపులి సంచరించినట్లు ఎలాంటి నిర్ధారణ కాలేదు. చిరుతపులి ఫోటోను కృత్రిమంగా సృష్టించి ప్రచారం చేసినట్లు గుర్తించారు.ఈ తప్పుడు ప్రచారం కారణంగా ప్రజల్లో భయాందోళనలు కలిగే అవకాశం ఉండటంతో పాటు, అటవీ శాఖ అధికారులు, పోలీసు సిబ్బంది విలువైన సమయాన్ని వెచ్చించాల్సి వచ్చిందని ఫిర్యాదుదారు పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments