ఎల్బీనగర్:
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కి!!శే శ్రీ డా!! వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77 వ జయంతి సందర్భంగా ఉమ్మడి శ్రీ రామకృష్ణాపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న గణేష్ నేత రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుక ఉపేందర్ రెడ్డి అధ్వర్యంలో ఉమ్మడి ఆర్కేపురం డివిజన్ పరిధిలోని చిత్రా లేవుట్ కాలనీ లోని మంగళవారం వైఎస్ఆర్ కాంస్య విగ్రహానికి పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా పున్న గణేష్ నేత, చిలక ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల ఆశాజ్యోతి దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల ఆత్మ బందువుగా చోటు సంపాదించిన గొప్ప నేత వైఎస్ఆర్ అన్నారు. ఉచిత కరెంట్ పై తొలి సంతకం, రైతులకు రుణమాఫీ, ఆరోగ్య శ్రీ ,ఇండ్ల పట్టాలు, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు పావలా వడ్డీకే రుణాలను, పెన్షన్లను ప్రవేశపెట్టి ఇచ్చిన హామీలను నెరవేర్చిన మహనీయులు రాజశేఖర్ రెడ్డి అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండి మధుసూదన్ రావ్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం చైర్మన్ తలాటి రమేష్ నేత,ముప్పిడి లింగస్వామి గౌడ్, రామకృష్ణ గౌడ్, దుబ్బాక శేఖర్,జ్ఞానేశ్వర్ యాదవ్, పగడాల ఎల్లన్న, కృష్ణారావు, వెంకటేశం గుప్తా, వెంకటరమణారెడ్డి,అల్లేటి కిరణ్ కుమార్,నభి, రాజు నాయక్, కందుకూరి సుదర్శన్, గునుగంటి రమేష్ గౌడ్, రఫీ, సమ్మద్, విప్లవ రెడ్డి, నరసింహ యాదయ్య , శ్రీనివాస్ గౌడ్, పాషా, పటేల్ జహంగీర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు


