ఎల్బీనగర్:
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికకు సన్నద్ధం అవుతున్న జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ జోనల్ అధికారులు శుక్రవారం జోనల్, 12,13,14 సర్కిల్స్ కార్యాలయాలలో, పేరుకుపోయిన పాత సామాన్లు, చెత్త చెదారాన్ని శుభ్రంగా క్లీన్ చేశారు. జీహెచ్ఎంసీ చేపట్టిన ఈ క్లీన్ అండ్ గ్రీన్ పనిలో దాదాపుగా 18 మెట్రిక్ టన్నుల పాత సామాన్లను వేలం వేస్తారని తెలిసింది. అలాగే సరూర్నగర్ నగర్ చెరువు కట్టపై స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంలో భాగంగా గ్రామ పంచాయతీ ఆఫిసర్లు, రిసోర్స్ పర్సన్స్, శానిటేషన్ సిబ్బంది కలిసి ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక అంటూ నినాదాలు చేసి ప్రజలకు శుభ్రతపై అవగాహన కల్పించారు.డివిజన్ల పరిధిలోని పబ్లిక్ పార్కులలోని పనికి రాని వస్తువులు, చెత్త చెదారాన్ని శుభ్రం చేశారు.ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ సరూర్నగర్ సర్కిల్ డిప్యూటీ కమీషనర్ బోనగిరి శ్రీనివాస్, ప్రాజెక్ట్ ఆఫీసర్ విక్రాంత్ రెడ్డి, డిఈ చందన, ఎస్ఎస్ బుచ్చయ్య, సైదులు,యాకయ్య, సంజీవ్ రెడ్డి,రెవెన్యూ సిబ్బంది పాల్గోని చెరువు కట్టపై ఉన్న చెత్తను, ప్లాస్టిక్ వస్తువులను డంపింగ్ యార్డ్ కు తరలింపజేశారు.


